-

ముంబైలో ప్రేమికుల దినోత్సవానికి ఆటవిడుపు

14 Feb, 2016 00:46 IST|Sakshi
ముంబైలో ప్రేమికుల దినోత్సవానికి ఆటవిడుపు

ఈసారి ముంబైలో ప్రేమికుల దినోత్సవానికి ఆటవిడుపు కలిగేటట్టు ఉంది. అంటే శివసేనకి కొంచెం నిరాశే మరి. ఎందుకంటే ఇండియా బర్డ్ రేస్ కార్యక్రమంలో భాగంగా ఇవాళే ముంబైలో బర్డ్ రేస్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. బర్డ్ రేస్ అంటే పక్షులు గుర్రాల్లా పోటీ పడవు. పందెం కోళ్లలాగా పోట్లాడుకోవు. పక్షి ప్రేమికులే ముంబైకి అరవై కిలోమీటర్ల పరిధిలో అనేక జాతుల పక్షులను గుర్తించ డంలో పోటీ పడతారు. ముంబై 12వ బర్డ్ రేస్‌లో 14 నగరాల నుంచి పర్యావరణ, పక్షి ప్రేమికులు పాల్గొంటున్నారు.
 
 వీరంతా బృందాలుగా విడిపోయి అన్వేషణ ఆరంభిస్తారు. ఈసారి 350 రకాల పక్షులను అక్కడ వదులుతున్నారు. 11వ ముంబై బర్డ్ రేస్‌లో వీటి సంఖ్య 150 మాత్రమే. అయితే అప్పుడు ఓ అపురూప ఘటన జరిగింది. విజయాబాలన్ అనే 72 ఏళ్ల మహిళ తన కుమార్తె సాయంతో 70 వరకు పక్షి జాతులను గుర్తించి అగ్రస్థానంలో నిలిచింది. ఇంతకీ ఆమె కేన్సర్ వ్యాధిగ్రస్తురాలు. ఆ పక్షులని ఆమె పామ్ బీచ్‌లోని మామిడితోటల్లోనే కనుగొంది.  పర్యావరణ, జీవకారుణ్యం పట్ల మరింత అవగాహన పెంచడానికే దేశంలోని వివిధ నగరాల్లో ఈ పోటీ నిర్వహిస్తున్నారు.  ఈ పోటీలతో విచిత్రమైన ఫలితాలు రావడం విశేషం.

మరిన్ని వార్తలు