కొత్త పుస్తకాలు

27 Jun, 2016 00:14 IST|Sakshi

 కువ్వ
 సంపాదకుడు: డప్పోల్ల రమేష్; పేజీలు: 156; వెల: 100; ప్రతులకు: తెలంగాణ బహుజన మాసపత్రిక, కేరాఫ్ కెంపుల రాజు, 4-8-111/ఎ, మంజీర నగర్, సంగారెడ్డి, మెదక్-502001; ఫోన్: 9550923323
 ‘దళితుల రిజర్వేషన్లలో అసమ ప్రయోజన లబ్ధి పట్ల అసహనంతో వర్గీకరణ జరగాలని మాదిగలు ‘దండోరా’ వేయటం సమైక్య ఆంధ్ర దేశానికి సమగ్రంగా తెలుసు. అయినా వర్గీకరణ జరగలేదు’. ‘ఎ బి సి డి’కి మద్దతుగా 60 మంది కవులు పాడుతున్న వర్గీకరణోద్యమ సంఘీభావ కవిత్వం ఇది. ‘ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలోని మానవీయ కోణాల్ని సమాజానికి చూ’పించే సంకలనం ఇది.
 
 జీవన చిత్రం
 రచన: చెన్నూరి సుదర్శన్; పేజీలు: 268; వెల: 200; ప్రతులకు: రచయిత, 1-1-21/19, ప్లాట్ నం.5, రోడ్ నం.1, శ్రీ సాయి లక్ష్మి శోభ నిలయం, రామ్‌నరేశ్ నగర్, హైదర్‌నగర్, హైదరాబాద్-85. ఫోన్: 9440558748
 హుజురాబాద్‌లో 1952లో కన్ను తెరిచినప్పటినుంచీ, బాల్యం, కుటుంబం, భార్యాపిల్లలు, అధ్యాపక బాధ్యతలు, కళల్లోకి ప్రవేశం, రచనా వ్యాసంగం... ఇలా రచయిత ప్రయాణాన్ని ఈ ఆత్మకథ చెబుతుంది. ‘ఒక నిరక్షరాస్య కుటుంబంలో పుట్టిన రచయిత క్రమంగా ఒక మాస్టర్ ఆఫ్ ఫిలాసఫర్ వరకు ఎదిగి తన కుటుంబ సభ్యులందరికీ ఉన్నత చదువులు చెప్పించి పిల్లలు అమెరికాలో స్థిరపడటం వరకు శ్రమించిన వైనం’ ఈ పుస్తకంలో కనబడుతుంది.
 
 దండకారణ్య కథలు (2013-15)
 రచన: షహీదా, ఎన్.డి., యామిని, మైనా, మిడ్కో; ప్రచురణ: విరసం; పేజీలు: 136; వెల: 70; ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక షాపులు.
 దండకారణ్య కథలు (2005-12) తర్వాత వచ్చిన కొనసాగింపు సంకలనం ఇది. ఇందులో 8 కథలున్నాయి. ‘దండకారణ్య కథలు జనతన సర్కారు- ప్రజా విముక్తి గెరిల్లా సైన్యం ఏర్పాటు దాకా చర్చించాయి. ఆ తరువాతి పరిణామాలను ముఖ్యంగా జనతన సర్కారు- ప్రజా విముక్తి సైన్యం గ్రీన్‌హంట్ మూడో దశ అయిన ఏర్‌బేస్‌ల నిర్మాణం యుద్ధ విమానాలతో దాడిని ఎదుర్కోవడానికి సిద్ధపడటంలో భాగంగా ఈ ఎనిమిది కథలను చూడవచ్చును’.
 

>
మరిన్ని వార్తలు