సెక్సిస్ట్ ఔట్లుక్ని ఇకనైనా బద్దలు కొట్టాలి

10 Jul, 2015 09:05 IST|Sakshi
సెక్సిస్ట్ ఔట్లుక్ని ఇకనైనా బద్దలు కొట్టాలి

బిగుతైన దుస్తులు వేసుకుని స్మిత ర్యాంప్ మీద నడుస్తుంటే కెమెరా పట్టుకుని కేసీఆర్ ఆమె వంక చూస్తున్నట్లు వేసిన క్యారికేచర్... తను స్వయంగా అన్నట్లు ప్రజల్లో ఒక ‘అభిప్రాయాన్ని’ ఏర్పరుస్తుంది. ఔట్‌లుక్ ‘నో బోరింగ్ బాబు’ వివాదం గురించి ఎన్డీటీవీతో మాట్లాడుతూ స్మితా సబర్వాల్ ఈ మొత్తం విషయాన్ని ‘కాన్స్పిరసి’ అ న్నారు. ఈ పదానికి తె లుగులో కుట్ర, దురా లోచన, మంత్రాంగం అనే అర్థాలున్నాయని శబ్దకోశం చెబుతోంది.

 

మన రాజ్యాంగం, ఆర్టికల్ 164(2)లో ముఖ్య మంత్రితోపాటు మంత్రులు కూడా లెజిస్లేటివ్ అసెంబ్లీకి సమష్టి బాధ్యత వహించాలి అని చెబు తుంది. కాని నేటి మన రాజకీయ పార్టీలు, మరీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలోని ప్రాంతీ య పార్టీలు వ్యక్తి కేంద్రంగా ఉంటూ వస్తున్నా యి. దాంతో ముఖ్యమంత్రి అవుతున్న ఆ పార్టీ నేత సార్వభౌమత్వాన్ని పొందుతున్నాడు. అతని కార్యాలయం ‘పవర్ సెంటర్’గా మారిపోయిం ది. ఆ పవర్ సెంటర్లో అధికారిగా కీలకమైన స్థానంలోకి చిన్న వయసులో అనేక మందిని దాటుకుని చేరుకున్నది స్మిత.
 
 ప్రధానమంత్రి లేదా ముఖ్యమంత్రులు తమ కార్యాలయాల్లో పనిచేసే అత్యున్నత స్థాయి అధికారులను, మంత్రుల్ని ఎంపిక చేసుకున్నట్లే, తమకు అనుకూలంగా పనిచేసేవారిని ఎంపిక చేసుకుని తెచ్చుకోవడం ఇప్పుడొక రివాజుగా ఉంది. మన రాష్ట్రం వరకు వస్తే ఆయా ముఖ్య మంత్రులు వారి కార్యాలయాల్లో అత్యున్నత పదవుల్లో నియమించుకున్న అధికారులను బట్టి ఆ ముఖ్యమంత్రి ప్రాధమ్యాలు ఏ రకంగా ఉం డబోతున్నాయో అనే సూచన కొన్నేళ్లుగా ఉంటూ వస్తోంది. రాజశేఖరరెడ్డి వంటి దార్శనిక ముఖ్య మంత్రులు దళిత మైనారిటీ వర్గాల అధికారు లను నియమించడం ద్వారా ఆ వర్గాలకు ఆత్మ స్థైర్యాన్ని ఇవ్వడమే కాకుండా ఆ వర్గాల అభివృ ద్ధిని ఉద్యమ స్థాయిలోకి తీసుకెళ్లడానికి ప్రయ త్నించారు.
 
 ఒక సుదీర్ఘ ఉద్యమ ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. ఒక ప్రత్యేక అస్తిత్వ పోరాటాన్ని అతి నేర్పుగా నడి పిన ఈ నాయకుడు రాష్ట్ర అవతరణ దినోత్సవా నికి ముందు, దళితుడే తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి అవుతాడని ప్రకటించి ఉన్నాడు. అలాగే నవ తెలంగాణ  నిర్మాణం కోసం ఇతర రాష్ట్రాలలో పనిచేస్తున్న తెలంగాణకు చెందిన ఉన్నత స్థాయి అధికారులను డెప్యుటేషన్ మీద తీసుకొస్తానని కూడా ప్రకటించి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన కార్యాలయంలో అధికారు లు పూర్తిగా తెలంగాణ నేపథ్యం ఉన్నవారే అయి ఉంటారని.. వారిలో దళితులు, మైనారిటీలు కూడా ఉంటారని చాలామంది అనుకున్నారు.

 

కానీ అందుకు భిన్నంగా.. సుదీర్ఘ అనుభవం, ప్రతిభ ఉన్న ఒక తెలంగాణ వాసిని ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించడంతోపాటు బెంగాలీ నేపథ్యం ఉన్న సమర్థులైన యువ అధికారిణిని అదనపు కార్యదర్శిగా నియమించుకున్నారు. స్మిత తన నియామకంపై మాట్లాడుతూ, ‘ఇంత వరకు మహిళలు లేని చోట మహిళలను నియ మించి, సీఎం కేసీఆర్ సమాజానికి ఒక సందేశా న్నిచ్చారు’ అని అన్నారు. అయితే ఈ మొత్తం విషయాన్ని పరిశీలిస్తే మనలో కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయి. తెలంగాణ ఆత్మగౌరవం పేరిట ఏర్పడ్డ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేయడానికి సమర్థత, ప్రతిభ కలిగిన బలహీ నవర్గాలకు చెందిన ఒక్క తెలంగాణ ఐఏఎస్ కూడా కేసీఆర్‌కి కనిపించలేదా?
 
 చరిత్ర పొడవునా అధికారం కోసం జంతు నీతితో మనం పోట్లాడుతూనే వచ్చాం. అది ఇవా ళ కొత్త కాదు. కొత్త ఏమిటంటే ఇక్కడ అధికారం కోసం జరిగిన పాచికలాటలో ఒక మహిళ గెలు పొందింది. గెలుపు సాధించడానికి పురుషుడి కైనా, స్త్రీకైనా పరిచయాలు, కులాలు, మతాలు, నేపథ్యాలు వంటి ఎన్నో అంశాలు కీలకపాత్రలు పోషిస్తాయి. కానీ పురుషుడికి భిన్నంగా అధికా రంలో ఉన్న ఒక స్త్రీ మీద దాడి జరిగేటప్పుడు మాత్రం ఆమె లైంగికత అక్కడ ప్రధాన అంశమై నిలుస్తుంది. ఔట్‌లుక్ పత్రిక చేసింది కూడా అదే. బిగుతైన దుస్తులు వేసుకుని స్మిత ర్యాంప్ మీద నడుస్తుంటే కెమెరా పట్టుకుని కేసీఆర్ ఆమె వంక చూస్తున్నట్లు వేసిన క్యారికేచర్... స్మిత స్వయంగా ఎన్డీటీవీతో అన్నట్లు ప్రజల్లో ఒక అభి ప్రాయాన్ని ఏర్పరుస్తుంది.
 
  స్మితలాగే సమాన ప్రతిభ ఉన్నవాళ్లు చాలామంది ఉన్నా స్మిత సౌం దర్యం ఆమెని ఆ స్థానానికి తీసుకెళ్లిందని, కేసీ ఆర్ ఆమెని ఒక వస్తువుగానే చూసి తీసుకెళ్లి ఆ స్థానంలో కూర్చోబెట్టాడనేదే ఆ అభిప్రాయం. ఈ తరహా దాడి పురుషులతో పోటీ పడ గలిగే స్థాయికి చేరిన స్త్రీలందరికీ అనుభవమే.  ఒక స్త్రీ ఈ పురుషస్వామ్య ప్రపంచంలో కీలక స్థానంలో నిలిచిందంటే ఆమె కత్తిమీద సాము చేసి వచ్చిందని అర్థం. స్మిత కీలక పదవిని పొం దడంలోనే కాదు ఈ ప్రపంచం చేసిన లైంగిక పరమైన దాడిని ధైర్యంగా ఎదుర్కోవడం ద్వారా కూడా సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అనే సోషల్ డార్వి నిజం ప్రకారం ఫిట్టెస్ట్ ఆఫ్ ది ఫిట్టెస్ట్‌గా నిలి చింది. మన సమాజం స్మిత పట్ల లేదా ఆమె లాం టి స్త్రీలపట్ల వ్యక్తపరుస్తున్న ఈ సెక్సిస్ట్ ఔట్ లుక్ ని ఇకనైనా బద్దలు కొట్టాల్సిన అవసరం ఉంది.


 (వ్యాసకర్త కథా రచయిత్రి)
 మొబైల్: 80196 00900
 - సామాన్య

మరిన్ని వార్తలు