ఫొటోల నిషేధంతో ప్రకటనల జోరు తగ్గేనా?

17 May, 2015 00:44 IST|Sakshi
ఫొటోల నిషేధంతో ప్రకటనల జోరు తగ్గేనా?

అవలోకనం
 
అమెరికాను యుక్త వయసులో తొలిసారిగా దర్శించినప్పుడు అక్కడి రాజకీయ ప్రకటనల్లో, నేతల ఫొటోలకంటే విషయానికి మాత్రమే ప్రాధాన్యత ఉండటం గమనించాను. అత్యంత విద్యావంత సమాజానికి, అత్యంత అవిద్యావంత సమాజానికి మధ్య అంతరం ఇదే కాబోలు. అయితే విగ్రహాలను ఆరాధించే మనలాంటి సమాజాలకు విషయం కంటే నేతల దర్శనమే ముఖ్యం కావచ్చునేమో..
 
 దేశ రాజకీయ పార్టీలన్నీ ద్వేషించే తరహా తీర్పును భారత సర్వోన్నత న్యాయస్థానం ఇటీవలే ప్రకటించింది. నేనయితే వ్యక్తిగతంగా ఈ నిర్ణయాన్ని ఆమోదించను కానీ, దాన్ని రాజ్యాంగపరమైన అనౌచి త్యానికి సంబంధించిన విషయమని కానీ లేదా ఈ అంశం సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సినంత ప్రాధాన్యమైనదని కానీ నేను భావించటం లేదు. కాని ఈ తీర్పు ఇప్పుడు మన మధ్య ఉనికిలో ఉంది.
 ప్రభుత్వం నగదు చెల్లింపు చేసి ప్రచురించే ఏ ప్రకటనలో అయినా సరే ముగ్గురు వ్యక్తుల ఫొటోలను మాత్రమే ప్రచురించుకోవచ్చని సుప్రీంకోర్టు ఈ తీర్పు ద్వారా ఆదేశించింది. ఇవి సర్వసాధారణంగా డైరె క్టరేట్ ఆఫ్ ఆడియో-విజువల్ పబ్లిసిటీ -డీఏవీపీ- విడుదల చేసే ప్రకటనలు. భారతీయ ప్రింట్ పత్రికలన్నిటికీ డీఏవీపీ అనే సంక్షిప్త పదానికి అర్థం సుపరిచితమే. ఈ ప్రకటనలను సబ్సిడీ ధరలతో విడు దల చేస్తుంటారు. అయితే వీటి పరిమాణం దృష్ట్యా అన్ని వార్తాపత్రి కలు, టీవీ స్టేషన్లు ఈ తరహా ప్రకటనల కోసం తీవ్రంగా ప్రయత్ని స్తుంటాయి. ఎన్నికలకు ముందు ఇలాంటి ప్రకటనలు తారస్థాయికి చేరుకుంటాయి కానీ సంవత్సరం పొడవునా కూడా వీటిని విడుదల చేస్తుంటారు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, వార్షికోత్సవాలు వంటివి కూడా ఈ ప్రకటనల కింద విడుదల చేస్తారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు తాము సాధించిన విజయాల గురించి చెప్పుకోవడానికి ఈ ప్రకటనలు ఏకైక అతి పెద్ద మార్గంగా ఉంటు న్నాయి. సాధారణంగా ఈ ప్రకటనల్లో ఫొటోలే సింహభాగాన్ని ఆక్రమిస్తుం టాయి. ఈ ఫొటోలను ప్రకటన పైభాగంలో లేదా ప్రకటన స్థలంలో అత్యంత ప్రధానమైన చోట ప్రచురిస్తుంటారు. ఈ ఫొటోలు ఒక అధిక్రమాన్ని అనుసరిస్తుం టాయి. అతి శక్తిమంతులైన నేతలు ఈ ప్రకటనల్లో ప్రధాన స్థానాన్ని పొందుతుం టారు. ఇతరుల కంటే పెద్ద పరిమాణంలో వీరి ఫొటోలు ఆయా ప్రకటనల్లో దర్శనమిస్తాయి. కేంద్ర ప్రభుత్వం జారీ చేసే ప్రకటనల్లో ప్రధానమంత్రితో పాటు ఆ ప్రకటనను విడుదల చేసిన శాఖకు చెందిన కేబినెట్ మంత్రి ఫొటోలకు ప్రాధా న్యత లభిస్తుంది. సహాయ మంత్రులు, ఇతరుల ఫొటోలు చిన్న పరిమాణంలో ప్రకటన దిగువ భాగంలో ప్రచురితమవుతుంటాయి.
 ఇక రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే ప్రకటనల్లో ముఖ్యమంత్రికి ప్రాధాన్యత లభిస్తుంది. ప్రకటనలోని విషయానికి తక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఎందు కంటే ఇక్కడ ఫొటోకు ఉన్న ప్రాధాన్యత విషయానికి ఉండదు. (డీఏవీపీ వారి ప్రకటనలు నాణ్యమైన డిజైనర్లను ఆకర్షించవు అనేది వాస్తవమే అనుకోండి). స్థానిక స్థాయిలో చూస్తే ఇది కచ్చితమైన రాజకీయ ప్రకటన కాబట్టే నేనిలా చెబుతున్నాను.
 భారత్‌కు ఇరుగుపొరుగున ఉన్నవారిని చూస్తే, అక్కడి బిల్‌బోర్డులన్నీ పూర్తిగా ఫొటోలతో నిండిపోవడాన్ని మనం చూడవచ్చు. వీటిలో టెక్స్ట్ చాలా తక్కువగా ఉంటుంది. ఈ బిల్ బోర్డులను రాజకీయ పార్టీ నెలకొల్పినట్లయితే, వాటి పైభాగాన ఆ పార్టీ అగ్రనేత కనిపిస్తుంటాడు, అతడి లేదా ఆమె మద్దతు దారుల ముఖాలు కింది వరుసలో ఉంటాయి. ఒకవేళ ఈ బిల్‌బోర్డులు అధీకృతం కానట్లయితే అవి జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలను అభినందిస్తూ కనబడే ఒక స్థానిక నేత భారీ సైజు ఫొటోను కలిగి ఉంటాయి. అంటే పై స్థాయినేతలతో ఆ నేతకు ఉండే సాన్నిహిత్యానికి ఇది ప్రతీక అన్నమాట.

నేను యుక్తవయసులో మొదటిసారిగా అమెరికాకు వెళ్లినప్పుడు, యార్డ్ సైన్‌లు అని అక్కడి వారు పిలుచుకునే స్థానిక రాజకీయ ప్రకటనలను చూసి ఆశ్చర్యపోయాను. ఎందుకంటే అవి కేవలం టెక్ట్స్‌తో మాత్రమే ఉండేవి (సెనేట్‌కి ప్రాక్స్‌మిర్ లేదా సెనేట్‌కి కాస్టెన్.. ఇలా వ్యక్తుల పేర్లు మాత్రమే వాటిలో ఉండేవి). వాటిలో ఫొటోలు ఉండేవి కావు. వాటి అవసరం లేదనిపిం చేలా అవి కనబడేవి. అత్యంత విద్యావంత సమాజానికి, అత్యంత అవిద్యావంత సమాజానికి మధ్య ఆంతరం ఇదే కావచ్చు మరి. దీన్ని మరింత లోతుగా అంచనా వేస్తే, విగ్రహాలను పూజించేటటువంటి ప్రజ లకు వ్యక్తులు లేదా నేతల దర్శనం అత్యంత ప్రధానం కావచ్చు.

మళ్లీ మనం సుప్రీం కోర్టు తీర్పు వద్దకు వస్తే, ఇకనుంచి భారత్‌లో విడుదలయ్యే వేలాది ప్రకటనలలో ఇకపై కేవలం ముగ్గురి ఫొటోలు మాత్రమే మనం చూస్తాం. వారు భారత రాష్ట్రపతి, ప్రధానితోపాటు.. న్యాయవ్యవస్థ పబ్లిసిటీ సామగ్రిని పెద్దగా జారీ చేయదు కాబట్టి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఫొటో కూడా ఈ ప్రకటనల్లో కనిపించవచ్చు.

చమత్కారమేమిటంటే, తమ ఫొటోలను ప్రకటనల్లో ఉపయోగిం చడం సబబేనా అనే విషయాన్ని ఈ ముగ్గురు వ్యక్తులు తమకుతాముగా నిర్ణయించుకోవచ్చునని కోర్టు పేర్కొంది. దీన్ని చమత్కారమని ఎందు కన్నానంటే, మన ప్రధాని తన ఫొటోలు ప్రచురితం కావడాన్ని ఇష్టపడ తారు కాబట్టి, ఇకపై ఆయన ఫొటోలను ఎక్కువగా ఉపయోగించినట్ల యితే వెంటనే అది రాజకీయ దాడిని ఆకర్షించవచ్చు కూడా. మరి, కోర్టు ఇతరుల ఫొటోలను ఎందుకు నిషేధించినట్లు? నాకు ఇది ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఎందుకంటే యాడ్‌లతో కోర్టులకు సమస్య లేదు (డూప్లికేట్ ప్రకటనలు కానట్లయితే, ఉదాహరణకు అనేక విభాగాలు ఒకే విషయంపై ప్రకటనలను జారీ చేస్తుంటాయి. కాబట్టి నా అభిప్రాయంలో అలాం టివి కళాత్మకంగా కానీ నైతికపరంగా గానీ అభ్యంతరకరంగా కనిపించవచ్చు.
 బహుశా న్యాయస్థానం భారతీయుల విస్తృత మానసికతత్వాన్ని అర్థం చేసుకుని ఇలా ఆలోచించి ఉండవచ్చేమో. ఫొటోలను నిషేధిస్తే యాడ్‌లు కుదిం పునకు గురై ప్రభుత్వ ధనం కాస్త ఆదా అవుతుందని కోర్టు భావించి ఉండవచ్చు. కారణమేదైనా కావచ్చు.. కానీ రాజకీయ పార్టీలు ఈ తీర్పును స్వీకరించవు. తమకు అందుబాటులో ఉన్న ఏకైక అతి ముఖ్యమైన సందేశ సాధనాలను తొలగి స్తున్న విషయానికి సంబంధించి మన నేతలు ఐక్యంగా వ్యవహరించవచ్చు. ఎందుకంటే మన నేతలు అత్యంత సూక్ష్మబుద్ధి కలవారు. మనలో చాలామంది కంటే వీరు తమపై తాము చక్కటి అవగాహన కలిగిన వారు కాబట్టి ఈ అవ రోధాన్ని ఎలా అడ్డుకోవాలనే విషయంపై వీరంతా కలసి పనిచేయవచ్చు కూడా.

 (వ్యాసకర్త కాలమిస్టు, రచయిత)
 aakar.patel@icloud.com)·
 
ఆకార్ పటేల్
 

>
మరిన్ని వార్తలు