కయ్యాల నేతల రాజకీయ రభస

12 Sep, 2015 01:36 IST|Sakshi
కయ్యాల నేతల రాజకీయ రభస

మోదీ, సోనియాలు ఇంకా ప్రచార పంథాలోనే కూరుకుపోయి ఉన్నారు. అది వారికి, పరిపాలనకు హాని చేస్తున్నా పట్టించుకోవడం లేదు. గందరగోళపు రాజకీయ వాతావరణంలో పరిపాలన సాగించడానికి విజేతకు ఉండాల్సిన ఉదార హృదయం మోదీకి లేదు. అందుకే ఇచ్చిపుచ్చుకునే ఒప్పందాలకు, సమస్యల ప్రాతిపదికపై కూటములకు ఆయన విముఖులు. నవ్వుతూ పరిష్కరించాల్సిన సమస్యలను ముఖం చిట్లిస్తూ క్లిష్టంగా మారుస్తున్నారు. కాంగ్రెస్ లాగే ఆయనా తక్కువ వ్యయంతో కూడిన, సోమరి విధానమైన నిరంతర సమర స్థితినే ఎంచుకున్నారు.  
 
 గత మంగళవారం దేశ రాజధానిలో సమాంతరంగా ఆవిష్కృతమైన రెండు ఒకేలాంటి దృశ్యాలు మన దేశ రాజకీయ వాస్తవికతను నిర్వచిస్తాయి. అందులో ఒకటి ప్రధాని నరేంద్ర మోదీ రేస్ కోర్స్ రోడ్డులోని తన అధికారిక నివాసంలో కార్పొరేట్ అధినేతలతో జరిపిన సమావేశం. మరొకటి, సోనియాగాంధీ తమ పార్టీ అగ్రనేతలతో జరిపిన సమావేశం. ఆ రెండు సమావేశాలూ ఇంచుమించుగా ఒకే సమయంలో జరిగాయి.
 
 దుర్బల ఆర్థిక వృద్ధికి దన్నుగా నిలవగల ఆలోచనల కోసం మోదీ అన్వేషిస్తున్నారు. వ్యాపార వర్గాలు మోదీపై భారీ అంచనాలు పెట్టుకున్నాయి. దీంతో ఆశ్చర్యకరంగా నేడు వారిలో వ్యాపార విశ్వా సం సడలుతున్నట్టు కనిపిస్తున్నది. దానిని పునరుద్ధరించాలని కూడా ప్రధాని ఆశిస్తున్నారు. సరిగ్గా అలాగే సోనియా కూడా తమ పార్టీకి మంచి రోజులను తిరిగి తెచ్చే ప్రయత్నంలో, పార్టీ నైతిక స్థయిర్యాన్ని పునరుద్ధరించాలనే ప్రయత్నంలో మేధోమథనం చేపట్టినట్టని పిస్తోంది.
 
 టీవీ తెరల మీద ఈ రెండు దృశ్యాలను ఒక దాని తర్వాత ఒకదాన్ని చూస్తుంటే వాటి మధ్య పెద్ద తేడా కనిపించలేదు. భారత కార్పొరేట్ రంగం శ్రోతలు లేదా కాంగ్రెస్ శ్రోతలలో ఎవరు ఎక్కువ దయనీయంగా ఉన్నారో చెప్పడం కష్టం. ఇద్దరూ ఓటమికి గురై జావగారిపోయి ఉన్నవారే. వారిలో ఎవరూ తమ తమ సమావేశాల్లో తమ వాస్తవ సమస్యలను గురించి ప్రశ్నించే సాహసం చేసి ఉండరన డం నిస్సందేహం.
 
 ప్రచార పర్వం ముగించరా?
 సోనియా నుంచి మోదీ వరకు, ఈ ప్రచార క్యాంపయిన్ వైఖరిని వీడి, సాధా రణ రాజకీయాలకు, పూర్తికాలపు పరిపాలనకు తిరిగి వచ్చేదెన్నడు? సాధా రణ రాజకీయాలంటే పార్లమెంటు పనిచేయడం, చట్టాలను రూపొందిం చడం. ఆ క్రమంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య కలహాలుంటాయి. కానీ ప్రభుత్వం తాత్కాలికంగా చచ్చుబడి పోవడం ఉండదు. మోదీ కంట్లో నలుసుగా మారి చికాకు పెట్టడాన్ని మించిన పార్జీ పునరు జ్జీవన పథకం మరేమైనా ఉందా మేడమ్? లేదంటే, క్లుప్లంగా చెప్పాలంటే సూటు-బూటు వెక్కిరింతలకు మించి మన రాజకీయాలేమిటి? అని కాంగ్రెస్ వాదులు సోనియాను ప్రశ్నించి ఉండాల్సింది. ఇక మరోప్రశ్న, రాహుల్ భవిత, పార్టీ నాయకత్వ వారసత్వ పథకం ఏమిటి? (అలాంటిదొకటి ఉండి ఉంటే) అనేదే అవుతుందనుకోండి.
 
 ఈ రెండు సమావేశాల్లో పాల్గొన్నవారూ శక్తివంతులే. అయినా ఎవరికీ ప్రశ్నించగల ధైర్యం లేదు కాబట్టే దయనీయంగా కనిపించారు. మోదీ, సోని యాలు తమ చుట్టూ పెంచిపోషించిన జీవావరణం తమ వారిని సైతం ప్రశ్నించనిచ్చేది కాదు. వారు చేయగలిగిందల్లా తమ నేతకు హర్షధ్వానాలు పలకడమే, అది వారు చేస్తున్నారు. కాకపోతే వారు ఎందుకు జేజేలు పలుకు తున్నారో అదే వారికి సంబంధించి ఉన్న ఏకైక సమస్య? నేటి మన ఛిద్ర రాజకీయాల్లో వారు చేస్తున్న హర్షధ్వానాలు ఒకరి విషయంలోనైతే అద్భుత పోరాట పటిమను కలిగిన ఉపన్యాసాలకు, రెండో వారి విషయంలోనైతే సూటిగా అనుసరిస్తున్న ప్రతికూలాత్మక వైఖరికి.  మోదీ, సోనియాలు ఇంకా ప్రచార పంథాలోనే ఇరుక్కుపోయి ఉన్నారు.
 
 అది వారికి, పరిపాలనకు కూడా హాని చేస్తున్నా పట్టించుకోవడం లేదు. సోనియా, కాంగ్రెస్‌లు 2014 ఘోర పరాజయాన్ని, ప్రధానిగా మోదీ స్థానాన్ని సమంజసమైనదిగా అంగీకరించడానికి ఇష్టపడటంలేదనిపిస్తోంది. బిహార్, ఆ తదుపరి మరికొన్ని రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా, వాటివల్ల కాంగ్రెస్‌కు విముక్తి లభించే అవకాశమేదీ కనుచూపు మేరలో కనబ డటం లేదు. 2017 ఉత్తరప్రదేశ్ ఫలితాల విషయంలోనూ అంతే. అక్కడ ఆ పార్టీ పాత్ర నామమాత్రమైనదే. కుంభకోణాలనే సాధనంగా చేసుకుని పార్ల మెంటును స్తంభింపజేయడం మాత్రమే తమ ఏకైక రాజకీయాలుగా కాంగ్రెస్ ్రవారు చూస్తున్నారు.
 
 ఇద్దరిదీ ‘సోమరి’ బాటే
 పార్లమెంటును స్తంభింపజేయడానికి, తద్వారా పెద్ద మెజారిటీ ఉన్నా ప్రభు త్వాన్ని స్తంభింపజే యడానికి చేయాల్సిందల్లా రణగొణధ్వని మాత్రమేనని కాంగ్రెస్ అనుకునేట్టయితే.. అది తక్కువ వ్యయంతో కూడిన సోమరి విధా నాన్ని ఎంచుకుంటోంది. దేశంలోని రెండో అతిపెద్ద రాష్ట్రమైన మహారాష్ట్రను ఇటీవలే చేజార్చుకున్న మీరు క్షామ పీడిత మరఠ్వాడా ప్రాంతంలో పార్టీని పునర్నిర్మించడానికి మానసికంగా, శారీరకంగా ఎంతో కృషి చేయాల్సి వస్తుంది. కాంగ్రెస్ నిజంగానే సమాధిలోంచి లేచి సజీవంగా నిలవాలని గట్టిగా భావిస్తున్న పార్టీయైతే... అస్సాంలోని హిమంత బిశ్వశర్మ ప్రాంతీయ పార్టీని తృణీకార ధోరణితో కూడిన నిర్లక్ష్యంతో బీజేపీ వైపు మొగ్గేలా చేయదు.
 
 అలాగే మోదీ కూడా 2014 విజయం తదుపరి కూడా శాశ్వత సంఘర్ష ణల్లో మునిగితేలుతున్నారు. రెండు దశాబ్దాలకు పైగా రాజకీయంగా, మేధో పరంగా, కార్యశీలురుగా శక్తివంతులైన ప్రత్యర్థుల కూటమితో కందకాల్లో ఉండి పోరాడిన సైనిక నాయకుని మనస్తత్వాన్ని మోదీ తనతో పాటే ఢిల్లీకి పట్టుకువచ్చారు. ఆ ప్రత్యర్థులందరినీ అంతర్థానం చేసేసినా ముందుకు సాగ లేని అశక్తులుగా నిలిచారు. గందరగోళపు రాజకీయ వాతావరణంలో పరి పాలన సాగించడానికి మోదీకి విజేతకు ఉండాల్సిన ఉదార హృదయంగానీ, మూఢునికి ఉండే లెక్కలేనితనంగానీ లేవు.
 
 అందుకే ఆయన అధికారం నెరపే నేతలు అలవాటుగా చేస్తుండే పనులలో చాలా వాటిని చేయడానికి ఆయన విముఖత చూపుతున్నారు. ఇచ్చిపుచ్చుకునే ఒప్పందాలు చేసుకోవడం లేదు, సమస్యలపైన, చట్టాలు రూపొందించడంపైన కూటములను నిర్మించడం లేదు. ప్రతికూలాత్మకతను తగ్గించుకోవడం లేదు. నవ్వుతూ పరిష్కరించా ల్సిన సమస్యలను ముఖం చిట్లిస్తూ క్లిష్టంగా మారుస్తున్నారు. కాంగ్రెస్‌లాగే ఆయన కూడా తక్కువ ఖర్చుతో కూడిన, సోమరి విధానంగా నిరంతర సమరస్థితినే ఎంచుకున్నారు.
 
 ‘బిహార్’ తల రాత మారుస్తుందా?
 అందుకే నేను బిహార్ ఎన్నికల ప్రాధాన్యంపై రేగుతున్న అతిశయోక్తులతో కూడిన ప్రచారాన్ని నమ్మను. అవి ముఖ్యమైన, ప్రాధాన్యంగల ఎన్నికలే. కానీ వాటివల్ల గొప్ప ఘన విజయమో లేదా ఘోర పరాజయమో కలిగేదేమీ లేదు. విజయం ఎప్పుడూ గొప్పదే. కానీ బీజేపీ గెలిచినంత మాత్రాన అది మోదీ స్థానాన్ని పార్టీలో, ప్రభుత్వంలో మరింత బలోపేతం చేసేదేమీ కాదు. ఓడిపోయినంత మాత్రాన అది ఆయననేమీ బలహీనపరిచేదీ కాదు. అది ఇప్పుడే జరగకపోయినా ఆయనకు వ్యతిరేకంగా ఏర్పడ్డ పెద్ద కుల సంఘటన అందుకు సంసిద్ధంగా ఉన్న ఆధారం. కాకపోతే ఢిల్లీలో లాగా అక్కడ బీజేపీ తుడిచిపెట్టుకుపోవడం మాత్రం జరగదు.
 
 కాంగ్రెస్ విషయంలోనూ బిహార్ ఫలితాలు ఏమంత ప్రభావం చూపవు. ఈ ఎన్నికలు ఘన విజయమో లేదా ఘోర పరాజయమో అయ్యేది ఒకే ఒక్కరికే... నితీష్ కుమార్‌కు. గెలుపు జాతీయ స్థాయిలో ఆయన ప్రతిష్టను పెంచుతుంది. లాలూలాగా ఆయనకు కుల ఓటు బ్యాంకు లేదు. కాబట్టి ఓటమి ఆయన రాజకీయ జీవితానికి ముగిం పు పలుకుతుంది. పైగా జాతీయ రాజకీయాలపై నితీష్ గెలుపు, ఓటములు వాస్తవంగా ఎలాంటి ప్రభావమూ చూపవు.

బిహార్ ఎన్నికల ప్రచారం ముగిసిపోవడంతోనే శీతాకాల సమా వేశాలు దగ్గరపడతాయి. దీంతో రాజకీయాలు తిరిగి పార్లమెంటుకు చేరుతాయి. ఫలితాలు ఎలా ఉన్నా ఈ ఎన్నికలు దేన్నీ పరిష్క రించకపోగా, రాజకీయాలను మరింత శత్రుపూరితంగా చీల్చేస్తాయి. పార్లమెంటు సభా కాలాన్ని కోల్పోవడం కొనసాగేట్టయితే అది దేశంపైన దారుణమైన వ్యయాన్ని మోపుతుంది, మోదీ మరింత పరిపాలనా కాలాన్ని కోల్పోయేట్టు చేస్తుంది.
 
 దీర్ఘకాలంలో ఇది కాంగ్రెస్‌కూ కలిసివచ్చేది కాదు. యూపీఏ 2 హయాం లో బీజేపీ పార్లమెంటును స్తంభింపజేడం దీనికి భిన్నమైనది. అప్పుడు బీజేపీ ఎదుగుతున్న స్థితిలో ఉంది. సుష్మాస్వరాజ్, అరుణ్‌జైట్లీ పార్లమెంటు పనిని విచ్ఛిన్నం చేయడానికి నేతృత్వం వహించారు. కాగా మోదీ క్షేత్రస్థాయిలో ఆ పార్టీని రాజకీయంగా సంసిద్ధం చేయడానికి పూర్తి కాలం కృషి చేశారు. ప్రస్తు తం కాంగ్రెస్ ఓటరును శిక్షిస్తున్న భంగపడ్డ పరాజితునిలా మాత్రమే కనిపిస్తోంది.
 
పిల్లి మెడలో గంట కట్టేదెవరు?
ప్రభుత్వాన్ని నడపడం అధికార పార్టీ పని, పార్లమెంటు ఆ పనిలో అత్యావశ్య కమైన భాగం అని సూక్తి. మన ఆర్థిక వ్యవస్థ తిరిగి తన అద్భుతశక్తిని సాధించాలన్నా గానీ... ముందుగా దేశ రాజకీయ పరిస్థితిలో సాధారణ స్థితిని తిరిగి నెలకొల్పాలి. ఒక రాష్ట్ర ఎన్నికల తర్వాత మరో రాష్ట్ర ఎన్నికలకు సన్నద్ధం కావడానికి అంటిపెట్టుకునే కంటే, అవసరమైన రాజీవాద చర్యలను చేపట్టడమే మెరుగనే భావనను మోదీ ఆమోదించనిదే అది జరగజాలదు. ఆయన ఇప్పుడు ముట్టడిలో ఉన్న అహ్మదాబాద్ కోటలో లేరు.

భారత కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు వడ్డీ రేట్ల తగ్గింపు, బ్యాంకింగ్ బెయిలవుట్లపై పాత పాట తిరిగి పాడే బదులు ఈ విషయాన్ని ఆయనకు చెప్పి ఉండాల్సిం ది. అయితే అది జరగాలనుకోవడం కూడా... సూటు- బూటు పంథా తెలివై నదే అయినా, ఒంటరిగా సుదీర్ఘంగా వేచి ఉండాల్సిన ప్రతిపక్షం ఓపికగా నిర్వహించాల్సిన పాత తరహా పాత్రకు ప్రత్యామ్నాయం కాజాలదని కాంగ్రెస్ వాదులు సోనియాకు చెప్పడం ఎంత సంభవమో అదీ అంతే సంభవం!
 twitter@shekargupta
 - శేఖర్ గుప్తా

whatsapp channel

మరిన్ని వార్తలు