తంజావూరు తెలుగువారి తపన

8 Dec, 2013 00:18 IST|Sakshi
తంజావూరు తెలుగువారి తపన

సందర్భం

మండలి బుద్ధప్రసాద్, అధ్యక్షులు, అధికార భాషాసంఘం

 

 తెలుగు భాషా సాహిత్య సాం స్కృతిక వైభవానికి చిరునామా గా నిలిచింది తంజావూరు. ప్రతి ముగ్గురిలోనూ ఇద్దరు తెలుగు మాట్లాడుతున్నారు. కొన్ని తరా ల క్రితం ఈ తెలుగు కుటుంబా లు పొట్ట చేతపట్టుకొని వెళ్లినవి కాదు. రాజాశ్రయం పొందిన కవి, పండిత, నృత్య, నాట్య, సంగీత కళాకారులు, వేదాంతు లు, యోధులు, నిపుణులే వారిలో ఎక్కువ. రాష్ట్రంలోనూ, వెలుపలా 18 కోట్ల మంది తెలుగువారున్నారు. హిందీ తరువాత అత్యధికులు మాట్లాడే భాష తెలుగే ఇన్నాళ్లూ. 2011 జనగణనలో తమిళనాడులోని చాలా మంది తెలు గువారు మాతృభాష తెలుగని చెప్పకోలేకపోయారు. దీంతో వారిని తమిళులుగా చూపించారు. అందువలన మనం మూడో స్థానానికి దిగిపోయాం.

 

 తమిళనాట తెలుగు స్థితిగతుల అధ్యయనం కోసం ఒక పరిశీలక బృందాన్ని, పత్రికా ప్రతినిధులను తీసుకుని, ఈ నవంబర్ 5, 6 లలో తంజావూరు వెళ్లాం. అక్కడి తమి ళ విశ్వవిద్యాలయంలో తమ భాషాభివృద్ధికి జరుపుతున్న కృషి, సరస్వతీ మహలు గ్రంథాలయంలో ప్రాచీన తెలుగు తాళపత్ర గ్రంథాల స్థితిగతులను పరిశీలించటం, భాగవత నృత్యరీతికి ప్రసిద్ధి పొందిన మేలట్టూరు సందర్శనం, త్యాగరాజ సమాధి సందర్శనలతో యాత్ర సాగింది.

 

 తమిళ విశ్వవిద్యాలయం

 

 1952లో తంజావూరులో సమావేశమైన కొందరు తమిళ మేధావులు భాషా సంస్కృతుల అభివృద్ధికి ఒక విశ్వవిద్యా లయం ఉండాలని ప్రతిపాదించారు. అది 1981లో కార్య రూపం దాల్చి ఈ విశ్వవిద్యాలయం ఏర్పడింది. ఇందులో తమిళ భాషా సంస్కృతులకు సంబంధించి 32 విభాగాలు ఉన్నాయి. ఈ విశ్వవిద్యాలయ గ్రంథాలయంలో రెండు లక్షల గ్రంథాలు ఉన్నాయి. తమిళ విశ్వవిద్యాలయం చాన్స్‌లర్,తమిళనాడు గవర్నర్ డా. కొణిజేటి రోశయ్య, వైస్ చాన్స్‌లర్ ఆచార్య ఎం.తిరుమలై, రిజిష్ట్రార్ డా. ఎస్.గణేష్‌రామ్ తెలుగువారే!

 

 సరస్వతీ మహలు

 

 ‘తంజావూరు మహారాజ శెర్ఫోజీ (శరభోజీ) సరస్వతీ మహల్ గ్రంథాలయం’ విశిష్ట ప్రపంచ గ్రంథాలయాలలో ఒకటిగా ఎన్‌సైక్టోపీడియా బ్రిటానికా ప్రకటించింది. ఫ్రెం చి, ఇంగ్లీషు, ఇటాలియన్, లాటిన్ భాషలలో వెలువడిన తొలి గ్రంథాలు ఇక్కడ ఉన్నాయి. తంజావూరును ఏలిన మరాఠా రాజు రెండవ శెర్ఫోజీ 1798-1832 మధ్య ఈ గ్రంథాలయం కోసమే కాశీయాత్ర చేసి వేలాది తాళపత్ర ప్రతులు సమీకరించాడు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్కీవ్స్ వారి దగ్గర దాదాపు 600 తాళపత్ర గ్రంథాలు మైక్రోఫిల్మ్‌లు తీయించి భద్రపరచి ఉన్నాయి.

 

 పిల్లియార్పట్టి తంజావూరు సమీప గ్రామం. ఆ తెలు గుపల్లెలో మున్నూరు తెలుగు గడపలున్నాయి. మున్సబు ఎస్. ఆనందన్ తెలుగువాడు. కానీ తెలుగువారి మని ప్రక టించుకుంటే కోల్పోయే అవకాశాల గురించి వీరు వివరిం చారు. మాతృభాషకు దగ్గర కావడానికి సొంత రాష్ట్రం సహకారాన్ని మాత్రమే కోరుతున్నట్టు వారు చెప్పారు.

 

 మేలట్టూరు

 తంజావూరుకు 18 కి.మీ. దూరంలో మేలట్టూరు ఉంది. ఇక్కడి వరదరాజస్వామి గుడికి ఎంతో ఖ్యాతి ఉంది. తం జావూరు తొలి నాయక రాజు అచ్యుతప్పనాయకుడు (1501-1614), భక్తి ఉద్యమ కాలంలో, 510 మంది కూచి పూడి కళాకారులను ఆహ్వానించి, ఒక గ్రామాన్ని (ఇప్పటి మేలట్టూరు) దానం చేశాడు. ప్రతి కుటుంబానికి ఇల్లు, ఇం టికో బావి, రెండున్నర ఎకరాల భూవసతి కల్పించాడు. 1569-1595 మధ్య కూచిపూడి భాగవతులు అచ్యుతప్ప ఆహ్వానం మీద తంజావూరు చేరి, కృతజ్ఞతతో ఆ గ్రామా న్ని ‘అచ్యుతాపురం’గా పిలుచుకున్నారు.

 

 అదే మేళాల ఊ రు (మేలట్టూరు)గా ప్రసిద్ధమైంది. ‘మేలట్టూరు భాగవత మేళా’ ఒక నాట్య రీతిగా అవతరించింది. మేలట్టూరు వెం కట్రామ శాస్త్రి రాసిన పది తెలుగు యక్షగానాలని వీరు ప్రదర్శిస్తున్నారు. వాటిని తమిళ లిపిలో రాసుకొని కంఠ స్థం చేసి ప్రదర్శనలిస్తున్నారు. అందుకే ‘కచటతప’లు ‘గజ డదబ’లుగా వినిపిస్తాయి. తెలుగు రాకున్నా నృత్యాన్ని బట్టి కథ అర్థమవుతుంది. మేలట్టూరులో శ్రీలక్ష్మీ నృసిం హ జయంతి భాగవతమేళా నాట్యనాటక సంఘం (మేల ట్టూరు నటరాజన్ గ్రూపు), ఆర్. మహాలింగం ‘మేలట్టూ రు భాగవతమేళా నాట్య విద్యా సంఘం’ దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన సంస్థలు. ఈ కళకే అంకితమై జీవిస్తున్న ఎందరో ఇక్కడ కనిపిస్తారు. అచ్యుతప్ప మేలట్టూరును ఇచ్చిన వందేళ్ల తరువాత గోల్కొండ సుల్తాను తానీషా భాగవతులకు కూచిపూడి అగ్రహారాన్ని ఇచ్చాడు. ఈ భాగ వత మేళా తెలుగునాట కూచిపూడి, తమిళనాట మేల ట్టూరు నృత్య ప్రక్రియలుగా అభివృద్ధి చెందింది. ఆ రెండూ తెలుగు యక్షగానాలనే నమ్ముకున్నాయి.

 

 

 త్యాగయ్య సమాధి - ఆరాధన

 

 ‘పరమాత్మ వెడలె ముచ్చట’ అని పాడుతూ 6.1.1847 మధ్యాహ్నం త్యాగరాజస్వామి సిద్ధి పొందారు. కావేరి ఒడ్డున తన గురువు శొంఠి వెంకటరమణయ్య సమాధి చెంతనే తన పార్ధివ శరీరాన్ని సమాధి చేయాలని, అరవై ఏళ్ల తరువాత తన శిష్య పరంపరలచే తన ప్రభావం ప్రకాశిస్తుందనీ త్యాగరాజు పలికినట్లు చెబుతారు. అలాగే 1907 నుంచి స్వామి వారి శిష్యులు ఆరాధనోత్సవాలను ప్రారంభించారు.

 

 బెంగళూరు నాగరత్నమ్మ ఆ సమాధిని గుర్తించి, 7.1.1925న అక్కడ గుడి నిర్మించారు. నాగరత్నమ్మకు హరి నాగభూషణం, పారుపల్లి రామకృష్ణయ్యపంతులు, కోన వెంకటరాయశర్మ అండగా నిలిచారు. ఇతర రాష్ట్రా లలో స్థిరపడినవారిలో మాతృభాషతో కోల్పోయిన సాన్నిహిత్యాన్ని తిరిగి పెంపొందించుకోవాలన్న తాపత్ర యం కనిపిస్తుంది. ఇది తంజావూరులో సుస్పష్టం. అలాం టి వారికి తెలుగును బోధించడానికి చర్యలు తీసుకోవాలి. హిందీ వలెనే తెలుగుభాషా వ్యాప్తికి ఒక కేంద్రీయ సం స్థను ఏర్పాటు చేయాలి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పాఠ్యప్ర ణాళికలకు అనుగుణంగా తెలుగు పాఠ్యగ్రంథాలను త యారుచేయాలి. తెలుగు విశ్వవిద్యాలయంలోని మండలి వేంకటకృష్ణారావు అంతర్జాతీయ తెలుగు కేంద్రం ఈ దిశ గా కొంత కృషి చేస్తున్నప్పటికీ ప్రోత్సాహం లేక లక్ష్యాలను సాధించలేకపోతోంది. ఇతర దేశాలలో, ఇతర రాష్ట్రాలలో తెలుగు వారికి తగిన ప్రోత్సాహం రాష్ర్ట ప్రభుత్వం నుంచి అందాలి. అప్పుడే వారికి మూలాలు గుర్తుంటాయి. 

>
మరిన్ని వార్తలు