హైదరాబాద్లో 'ప్లీజ్ ఐ డోంట్ లవ్ యూ'.. శృంగారహాస్య నాటకం

5 Dec, 2013 19:42 IST|Sakshi

బెంగళూరుకు చెందిన ప్రముఖ రంగస్థల సంస్థ వుయ్ మూవ్ థియేటర్ గ్రూప్ ఈ నెల 7వ తేదీ శనివారం హైదరాబాద్లో ఆంగ్ల నాటకం ప్రదర్శించనుంది. 'ప్లీజ్ ఐ డోంట్ లవ్ యూ' అనే శృంగార హాస్య నాటకంతో అభిమానులను అలరించనున్నారు. అభిషేక్ అయ్యంగార్ దర్శకత్వం వహిస్తున్న ఈ నాటకo ‘ఒక జంట' చుట్టూ తిరుగుతుంది. అసూయ, ప్రేమ ఇతివృత్తంగా నాటకం సాగుతుంది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1, లామకాన్లో నాటకం ప్రదర్శిస్తారు. 2011లో వుయ్ మూవ్ థియేటర్ గ్రూప్ హైదరాబాద్లో మాల్గుడి డేజ్ అనే నాటకం ప్రదర్శించింది. దేశవ్యాప్తంగా 67 నాటకాలు ప్రదర్శించింది.

మరిన్ని వార్తలు