ప్రముఖ నిర్మాత వడ్డే రమేష్ ఇకలేరు

21 Nov, 2013 18:57 IST|Sakshi

ప్రముఖ తెలుగు సినీ నిర్మాత వడ్డే రమేష్ కన్నుమూశారు. గత కొంత కాలంగా కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న రమేష్.. హైదరాబాద్లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం మరణించారు. ప్రముఖ నటుడు వడ్డే నవీన్ తండ్రి అయిన రమేష్ గతంలో పలు హిట్ చిత్రాలు రూపొందించారు. ఎన్టీఆర్ హీరోగా బొబ్బిలిపులి, చిరంజీవి హీరోగా లంకేశ్వరుడు, కృష్ణంరాజుతో కటకటాల రుద్రయ్య, ఇంకా.. ఆత్మీయులు, విశ్వనాథ నాయకుడు లాంటి హిట్ చిత్రాలను ఆయన నిర్మించారు.

మరిన్ని వార్తలు