అప్పుడు చంద్రబాబు పట్టించుకోలేదు : అవంతి

18 Jun, 2019 09:50 IST|Sakshi

సాక్షి, అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీనియర్‌ అని నమ్మానని, కానీ ఆయన ఒంటెద్దు పోకడలకు పోయారని రాష్ట్ర పర్యాటక మంత్రి అవంతి శ్రీనివాస్‌ రావు తెలిపారు. టీడీపీలో ఉన్నప్పుడు చంద్రబాబుకు సూచనలు చేసినా పట్టించుకోలేదని, తానేప్పుడు వ్యక్తిగత స్వార్థం కోసం పనిచేయలేదన్నారు. చివరి రోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంగళవారం ఆయన సభలో ప్రసంగించారు. ప్రభుత్వ పథకాలపై ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఆయన తప్పుబట్టారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎప్పుడు నమ్మిన సిద్ధాంతం వీడలేదన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో ఏం చెప్పామో అదే చేస్తామని, వచ్చే ఐదేళ్లలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని స్పష్టం చేశారు. చంద్రబాబు రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారని, హోదాపై అనేక సార్లు యూటర్న్‌ తీసుకున్నారన్నారు. అమరావతి గురించి గొప్పగా చెప్పే చంద్రబాబు.. ఎందుకు ఓడిపోయారో ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. ప్రజలు 23 సీట్లు టీడీపీకి ఇచ్చినా ఆ పార్టీ సభ్యుల తీరు మారడం లేదన్నారు. పదేపదే తన ప్రసంగానికి అడ్డుపడటం సరికాదన్నారు.

రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొస్తామని, స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. పొలవరం ప్రాజెక్ట్‌పై కూడా టీడీపీ ఆత్మపరిశీలన చేసుకోవాలని, ఈ ప్రాజెక్ట్‌లో ఎంత అవినీతి జరిగిందో కమిటీ నిగ్గు తేల్చబోతుందన్నారు. అన్ని ప్రభుత్వ స్కూళ్లను ఇంగ్లీష్‌ మీడియా చేయడం గొప్ప అంశమన్నారు. వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీని టీడీపీ నిర్వీర్యం చేసిందని, గత ప్రభుత్వంలో చాలా సామాజిక వర్గాలు అభద్రతా భావానికి లోనయ్యాయని తెలిపారు. అందుకే ప్రజలు వైఎస్‌ జగన్‌ను అఖండ మెజార్టీతో ప్రజలు గెలిపించారని, పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించే ప్రసక్తేలేదని.. చెప్పిన దమ్మున్న నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డినే అని చెప్పారు. రాబోయే ఐదేళ్లలో 25 లక్షల ఇళ్లు కట్టిస్తామన్నారు దశాబ్దాలుగా ఉన్న ఆర్టీసీ సమస్యల టీడీపీ పరిష్కరించలేకపోయిందని, అధికారంలోకి రాగానే ఆర్టీసీ సమస్యలను పరిష్కరించే దిశగా.. తమ ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు.

చదవండి: వైఎస్ వివేకాకు అసెంబ్లీ సంతాపం

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఎన్‌ఐఏ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

ముస్లింలు జంతువుల్లా ప్రవర్తిస్తున్నారు: బీజేపీ ఎమ్మెల్యే

ముందు వినడం నేర్చుకోండి ఒవైసీ : షా క్లాస్‌

బాధ్యతలు స్వీకరించిన ఎమ్మెల్యే రోజా

క్లైమాక్స్‌కు చేరిన కర్ణాటకం

టీడీపీ జెండా కట్టి, పచ్చ చొక్కా వేస్తేనే...

కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన కృష్ణసాగర్‌ రావు

‘ఇంతవరకు రూ. 2 వేల పింఛను ఇవ్వలేదు’

ఆ ధోరణి ప్రమాదకరం : మాయావతి

కర్నాటకం: నేడే అవిశ్వాసానికి అనుమతించండి

గులాబీ ఫామ్‌లు ఎవరికిస్తారో!

‘2 వేల కంటే 15 వేలు తక్కువా చంద్రబాబు’

ప్రశ్నించే వారుండొద్దా...?

ఎన్నికల వరకే రాజకీయాలు

వైఎస్సార్‌సీపీకి పూర్వవైభవం వస్తుంది..   

ట్విట్టర్‌లో టీ‘ఢీ’పీ!

నా కొడకల్లారా... ఏ రెడ్డి వస్తాడో చూస్తాం

‘బాబు.. మీ పెంపుడు కుక్కను కంట్రోల్‌ చెయ్‌’

కౌన్సిలర్‌ టికెట్ల కోసం ఆశావహుల ఆరాటం

బాబును కేంద్రం జైలులో పెడుతుందని అనుకోను

సంకీర్ణానికి నాగరాజ్‌ ఝలక్‌

కేబినెట్‌ నుంచి సిద్ధూ నిష్క్రమణ

కే ట్యాక్స్‌పై అసెంబ్లీలో చర్చిస్తాం

ఏపీలోనూ టీడీపీకి రాజకీయ భవిష్యత్తు లేదు

హామీలను మించి లబ్ధి

రాష్ట్రాన్ని నాశనం చేశారు 

ల్యాండ్‌ మాఫీయాలో ఎంపీ హస్తం

బీజేపీలో చేరిన టీడీపీ అధికార ప్రతినిధి

నా ఫ్లెక్సీలో ఎన్టీఆర్‌ ఫొటో.. తప్పేముంది?

కర్ణాటకం : కాంగ్రెస్‌-జేడీఎస్‌ నేతల కీలక భేటీ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘అవును.. మేము పెళ్లి చేసుకున్నాం’

విలక్షణ నటుడి సరికొత్త అవతారం!

ఉత్కంఠ భరితంగా ‘వార్‌’ టీజర్‌

‘బాటిల్‌ని తన్నకండి.. నీటిని కాపాడండి’

అవునా.. అంతేనా?

ఆ విషయంలో మాత్రం తగ్గడం లేదట..!