‘మమతా నాయకురాలు కాదు.. ఓ దెయ్యం’

14 Jan, 2020 18:23 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. మమతా బెనర్జీకి శ్రీలంకలోని రాక్షసి లంకిణి లక్షణాలు ఉన్నాయని, ఆమె దెయ్యాల రాణి అని అభివర్ణించారు. పౌరసత్వ సవరణ చట్టం-2019పై మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘మమతా బెనర్జీకి సంపూర్ణమైన దెయ్యాల లక్షణాలున్నాయి. ఆమెలో మానవత్వ విలువలు, మహిళలకు ఉండాల్సిన లక్షణాలు లేవు. వేలాది మంది హిందువులను పొట్టనపెట్టుకున్న దుర్మార్గులను ఆమె రక్షిస్తున్నారు.ఇలాంటి నేతలను మనం దెయ్యాలుగా పిలుస్తుంటాం.  మమతా ఓ నాయకురాలు కాదు.. శ్రీలంకలోని రాక్షసి లంకిణి. ఓ దెయ్యానికి ఉండాల్సిన లక్షణాలను అన్ని మమతకు ఉన్నాయి’ అని వ్యాఖ్యానించారు.

బీజేపీ దేవతల పార్టీ అంటూ.. ఎస్పీ, బీఎస్పీ, టీఎంసీ రాక్షస జాతికి చెందినవని ధ్వజమెత్తారు. పశ్చిమ బెంగాల్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 18 సీట్లు గెలుచుకున్నామని.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని సురేంద్ర సింగ్ ధీమా వ్యక్తం చేశారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు