ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌కు భారీ షాక్‌

10 Nov, 2023 20:31 IST|Sakshi

సాక్షి, ఖమ్మం: ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీకి భారీ షాక్‌ తగిలింది. జిల్లాకు చెందిన పలువురు సీనియర్ కాంగ్రెస్‌ నేతలు సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌ పార్టీలోకి చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

వీరిలో సీనియర్ కాంగ్రెస్‌ నాయకుడు, మాజీ మంత్రి, పీసీపీ ఉపాధ్యక్షుడు సంభాని చంద్రశేఖర్.. తెలంగాణ ఉద్యమ విద్యార్థి నేత ప్రస్తుత పీసీసి ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతారాయ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎడవెల్లి కృష్ణ, సీనియర్ రాజకీయ నేత అబ్బయ్య దంపతులు, డా. రామచంద్రు నాయక్, వారితో పాటు పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
చదవండి: సీబీఐ, ఈడీ విచారణకు కేసీఆర్‌ సిద్ధమా?.. రేవంత్‌ సవాల్‌ 

మరిన్ని వార్తలు