సీఎం కన్నా ఊసరవెల్లి నయం

18 Mar, 2018 08:13 IST|Sakshi
మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నేత గంగుల ప్రభాకర్‌ రెడ్డి

ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి  

ఆళ్లగడ్డ: పూటకో మాట మార్చుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కన్నా ఊసరవెల్లి నయమని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని వైఎఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.  ఓటుకు నోటు కేసుకు భయపడి సీఎం చంద్రబాబు హోదాను కేంద్రానికి తాకట్టుపెట్టారని విమర్శించారు.

ఆయన అసమర్థతతోనే రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందన్నారు. దోచుకునేందుకే ప్యాకేజీ  ఒప్పకున్నారని  ఆరోపించారు. అదే ఏపీకి హోదా వచ్చి ఉంటే పరిశ్రమలు ఏర్పడి యువతకు ఉద్యోగ అవకాశాలు లభించేవి అన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు హోదా కోసం పోరాడుతున్న  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు తెలిపి చిత్తశుద్ధిని నిరుపించుకోవాలన్నారు.     

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా