చంద్రబాబు పనైపోయింది  | Sakshi
Sakshi News home page

చంద్రబాబు పనైపోయింది 

Published Sun, Mar 18 2018 8:20 AM

Chadrababu work is over - Sakshi

కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : సీఎం చంద్రబాబునాయుడుకు ఉన్న రాజకీయ అనుభవం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీలను సాధించడానికి పనికిరావడం లేదని, ఆయన అవుట్‌ డేడెట్‌ సీఎం అని వైఎస్‌ఆర్‌సీపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య విమర్శించారు. ఆయన కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి అయినా రాష్ట్రానికి చేసిన మేలు ఏమీ లేదన్నారు.  శనివారం వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో నగర అధ్యక్షుడు రాజావిష్ణువర్ధన్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన విలేకరుల సమావేశంలో  ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, పార్టీ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. చంద్రబాబు ఎప్పుడూ ఆయన సొంత ప్రయోజ నాలు కోసమే ప్రయత్నించారన్నారు. ఆయన వేషాలు, డ్రామాలు ఏపీ ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. 

చంద్రబాబు మైండ్‌ బ్లాక్‌... 
ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టడంతో చంద్రబాబుకు దిక్కుతోచడం లేదన్నారు.   వైఎస్‌ఆర్‌సీపీ పెట్టే  తీర్మానానికి మద్దతు ఇస్తామని ప్రకటించిన గంటల్లోనే తామే అవిశ్వాసం ప్రవేశపెడతున్నట్లు  సీఎం చెప్పడం మాట మీద ఆయన నిలబడరనేందుకు ఉదాహరణ అన్నారు.  40 ఏళ్ల రాజకీయ అనుభవం ముఖ్యం కాదని ఎంత చిత్తశుద్ధి, విశ్వసనీయత, విలువలు ఉన్నాయన్నదే ప్రధానమన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాల కోసం పరితపించే నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కరేనని చెప్పారు.  ఇప్పటికైనా నాటకాలు మాని వైఎస్‌ఆర్‌సీపీ  ఇచ్చిన అవిశ్వాసానికి టీడీపీ మద్దతు ఇవ్వాలని లేకపోతే వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. 

చంద్రబాబు జీవితాంతం జైలులోనే... 
సీఎం చంద్రబాబునాయుడు  ఆర్థిక, రాజకీయ, సామాజిక నేరగాడు అని బీవై రామయ్య విమర్శించారు.  26 కేసుల్లో విచారణ ఎదుర్కోకుండా  స్టే తెచ్చుకున్నారని ఆరోపించారు.  ఆయనపై విచారణ జరిగితే జీవితాంతం జైళ్లో ఉండాల్సి వస్తోందన్నారు. సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్‌ చేస్తున్న అవినీతిని  జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఆలస్యంగానైనా గుర్తించడం  సంతోషమన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తున్న నేపథ్యంలో సోమవారం   జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో మానవహారాలు నిర్వహిస్తామని చెప్పారు.  

గుండ్రేవుల, వేదవతి ప్రాజెక్టులకు నిధులేవీ?

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో గుండ్రేవుల, వేదవతి, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ నుంచి 68 చెరువులకు నీటిని మళ్లింపు తదితర వాటికి  బడ్జెట్‌లో ఎలాంటి నిధులు కేటాయించకుండా,  ఆయా ప్రాజెక్టులు  పూర్తి చేస్తామని  ప్రకటించడంపై పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి  ఆగ్రహం వ్యక్తం చేశారు.  అధికార పార్టీకి వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఉద్దేశం తప్ప  ప్రాజెక్టులపై చిత్తశుద్ధిలేదన్నారు. కేసీ కెనాల్‌ కింద సాగు చేసిన పంటలు ఎండుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. సమావేశంలో కోడుమూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ మురళీకృష్ణ, రాష్ట్ర నాయకులు తెర్నేకల్‌ సురేందర్‌రెడ్డి, సీహెచ్‌ మద్దయ్య, అబ్దుల్‌ రెహమాన్, కర్నాటి పుల్లారెడ్డి, పర్లా శ్రీధర్‌రెడ్డి, దేవపూజ ధనుంజయాచారి, డి.రాజశేఖర్, నాయకులు రమణ, కరుణాకరరెడ్డి, శివరామిరెడ్డి, భాస్కరరెడ్డి, సాంబశివారెడ్డి, రవిబాబు, రఘు, మళ్లి, బుజ్జీ, శేషుబాబు చౌదరి తదితరులు పాల్గొన్నారు.    

Advertisement
Advertisement