రూ.50 కోట్లు తెచ్చిన చరిత్రేనా?

7 May, 2018 11:42 IST|Sakshi
మాట్లాడుతున్న మంత్రి ఈటల రాజేందర్, వేదికపై ఎమ్మెల్యేలు సోమారపు సత్యనారాయణ, దాసరి మనోహర్‌రెడ్డి, ఎంపీ బాల్క సుమన్‌

పెద్దపల్లి : ఒక్క రోజే రూ.52కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని..ఐదేళ్ల పాలనలో రూ.50కోట్లు తెచ్చిన చరిత్ర మీకుందా..అంటూ పరోక్షంగా మాజీ ఎమ్మెల్యే విజయరమణారావుపై మంత్రి ఈటల రాజేందర్‌ ఫైర్‌ అయ్యారు. పెద్దపల్లిలో ఆదివారం ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో ఈటల కాంగ్రెస్‌ పార్టీ తీరుపై నిప్పులు చెరిగారు. పాత జిల్లా చీలికలై నాలుగు జిల్లాలుగా ఏర్పడినప్పటికీ మనందరిదీ కరీంనగర్‌గానే చూడాలన్నారు. ఉమ్మడి జిల్లాను అభివృద్ధి చేసుకునేందుకు ముఖ్యమంత్రి ఉదారంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్‌ నాయకులలో లేసినోళ్లు.. లేవనోళ్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని.. సహించేది లేదన్నారు.

రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ హరితహారం విధానంపై దాసరి మనోహర్‌రెడ్డి రోల్‌మోడల్‌గా నిలిచారన్నారు. ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి కోరినట్టుగా గుంపుల, గూడెం రోడ్లతోపాటు బౌద్ధస్థూపం వద్దకు తారు రోడ్డు వేసేందుకు నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఎంపీ బాల్క సుమన్‌ మాట్లాడుతూ పెద్దపల్లి, మంథని, రామగుండం నియోజకవర్గాలకు అవసరమైన ఎస్సారెస్పీ నీరిచ్చేందుకు మంత్రి హరీష్‌రావు ఒప్పుకున్నారన్నారు.

జిల్లాకు మంజూరైన మూడు రైల్వే ఓవర్‌ బ్రిడ్జిలను వేగవంతంగా నిర్మించాలని మంత్రి తుమ్మలను కోరారు. ప్రభుత్వ సలహాదారు వివేక్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని విదేశాల్లోనూ చర్చించుకుంటున్నారన్నారు. ఆర్టీసీ చైర్మన్‌ సోమారపు సత్యనారాయణ, టీఎస్‌టీఎస్‌ చైర్మన్‌ రాకేశ్‌కుమార్, ఐసీడీఎస్‌ రీజినల్‌ ఆర్గనైజర్‌ మూల విజయారెడ్డి, రామగుండం మేయర్‌ కొంకటి లక్ష్మీనారాయణ, పెద్దపల్లి మున్సిపల్‌ చైర్మన్‌ ఎల్‌.రాజయ్య, నాయకులు రఘువీర్‌సింగ్, నల్ల మనోహర్‌రెడ్డి, మాట్లాడుతున్న మంత్రి ఈటల రాజేందర్, వేదికపై ఎమ్మెల్యేలు సోమారపు సత్యనారాయణ, దాసరి మనోహర్‌రెడ్డి, ఎంపీ బాల్క సుమన్‌ కోట రాంరెడ్డి, ఐలయ్యయాదవ్, సారయ్యగౌడ్, సందనవేని సునీత, పాల రామారావు, మర్కు లక్ష్మణ్, పాటకుల అనిల్, కమల దయాకర్, కవ్వంపల్లి లక్ష్మి, గట్టు రమాదేవి, లంక సదయ్య, కుక్క కనకరాజు, కాంపెల్లి నారాయణ, ఉప్పు రాజ్‌కుమార్, ఉప్పు రాజు, పడాల సతీష్‌గౌడ్, కొయ్యడ సతీశ్‌గౌడ్‌ పాల్గొన్నారు.

‘డబుల్‌’ ఇళ్లకు శంకుస్థాపన..

గోదావరిఖని/రామగుండం: రామగుండం ము న్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో మంజూరైన డబుల్‌ బెడ్‌రూం ఇళ్లకు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ శంకుస్థాపన చేశారు. ఫైవింక్లయిన్‌ సమీపంలో సింగరేణి స్థలంలో రూ.9.60కోట్లతో 160 ఇళ్లను నిర్మించనున్నారు. మంత్రి మాట్లాడు తూ పేదల సంక్షేమానికి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందన్నారు. త్వరగా పనులు ప్రారంభించాలని ఆదేశించారు.

ఆర్టీసీ చైర్మన్‌ సోమారపు సత్యనారాయణ, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్, నగర మేయర్‌ కొంకటి లక్ష్మీనారాయణ, స్త్రీ శిశు సంక్షేమశాఖ రీజినల్‌ ఆర్గనైజర్‌ మూల విజయారెడ్డి, కమిషనర్‌ డి.శ్రీనివాస్, సోమారపు లావణ్య, అరుణ్‌కుమార్, పెద్దెల్లి ప్రకాశ్, బాబుమియా, ఆర్‌అండ్‌బీ ఈఈ ఎం.కృష్ణమూర్తి, డీఈ ఎం.జయప్రకాశ్, జేఈ సురాజొద్దీన్‌ పాల్గొన్నారు. స్థానిక 23వ వార్డు భగత్‌సింగ్‌నగర్, సిక్కువాడలో నివసిస్తున్న తమకు వైఎస్సార్‌ హయాంలో ఇళ్ల పట్టాలు ఇచ్చారని.. ఇప్పుడు డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం కోసం తమ ఇళ్లను తొలగించవద్దని మంత్రికి వినతిపత్రం ఇచ్చారు.

 కార్యాలయం భవనాలకు శంకుస్థాపన

అంతర్గాంలో నూతనంగా నిర్మించే మండల పరిషత్‌ కార్యాలయాల సముదాయ భవన నిర్మాణ పనులను మంత్రి, ఎంపీలు ప్రారంభించారు. రెండెకరాల్లో రూ.కోటితో ఎంపీడీవో, వ్యవసాయం, ఉపాధిహామీ, ఈవోపీఆర్డీ, ఎంపీపీ కార్యాలయాలను నిర్మించనున్నారు. అనంతరం మండలకేంద్రంలో డబుల్‌ ఇళ్ల పనులను ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్‌ సోమారపు సత్యనారాయణ, కలెక్టర్‌ శ్రీదేవసేన ప్రారంభించారు. ఎంపీపీ రాజేశం, సర్పంచులు మడ్డి శశికళ, భూపెల్లి లత, పొన్నం లత, ఆముల శ్రీనివాస్, గంగాధరి శ్రీనివాస్‌గౌడ్, తీగుట్ల రాజయ్య, వైస్‌ఎంపీపీ కొదురుపాక పవన్, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్ష, కార్యదర్శులు మాడ నారాయణరెడ్డి, అర్శనపల్లి శ్రీనివాస్, ఏఎంసీ డైరెక్టర్‌ జూల లింగయ్య, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు పెద్దంపేట శంకర్, సింగిల్‌విండో డైరెక్టర్‌ బండారి ప్రవీణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు