బీజేపీలోకి సైనా.. జ్వాలకు చీవాట్లు

30 Jan, 2020 12:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బ్యాడ్మింట్‌ స్టార్‌ ప్లేయర్‌ సైనా నెహ్వాల్‌ బీజేపీలో చేరడంపై సహచర క్రీడాకారిణి గుత్తా జ్వాల తప్పు పట్టిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు అర్థం పర్థం లేని ఆటనే ఆడావనుకున్నా కానీ అర్థం పర్థం లేని పార్టీలో కూడా చేరావా అంటూ సైనాపై గుత్తా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ట్వీట్‌ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్‌ సోషల్‌మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. అయితే ఈ వ్యాఖ్యలపై ఇప్పటివరకు సైనా స్పందించనప్పటికీ.. నెటిజన్లు మాత్రం గుత్తా జ్వాలాకు చీవాట్లు పెడుతున్నారు. 

సైనా అర్థం పర్థం లేని రిలేషన్‌ షిప్‌లు, పెళ్లిళ్లు చేసుకోలేదని ఓ నెటిజన్‌ ఘాటుగా విమర్శించాడు. ‘సైనాను, బీజేపీని విమర్శించేముందు నీ స్థాయి ఏంటో ముందు చూసుకో, నీ సహచర క్రీడాకారిణపై అంత అక్కసు ఎందుకు? నువ్వు కూడా నీకు నచ్చిన పార్టీలో చేరొచ్చు కదా?’అంటూ నెటిజన్లు గుత్తా జ్వాలకు సూచిస్తున్నారు. అయితే ప్రస్తుతం సైనా నెహ్వాల్‌కు సంబంధించి గుత్తా జ్వాలా చేసిన ట్వీట్‌ను తొలగించినట్టు తెలుస్తోంది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రస్తుతం ఆ ట్వీట్‌కు సంబంధించిన స్క్రీన్‌ షాట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఇక సైనాతో పాటు ఆమె సోదరి చంద్రాన్షు సైతం అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బీజీపీలో చేరిన విషయం తెలిసిందే. ‘క్రీడారంగంలో అనేక టైటిల్స్‌ గెలిచాను. దేశం పేరు నిలబెట్టాను. దేశం కోసం మంచి చేసే బీజేపీలో నేడు చేరాను. కష్టపడి పనిచేసే వారంటే చాలా ఇష్టం. మోదీ రాత్రి పగలూ కష్టపడి దేశం కోసం పనిచేస్తున్నారు. ఆయనతో కలిసి దేశం కోసం పనిచేయడం నా అదృష్టం. మోదీ దేశంలో క్రీడారంగానికి చాలా మేలు చేశారు. నరేంద్ర మోదీ నుంచి నాకు స్ఫూర్తి లభిస్తుంది. దేశం కోసం మంచి చేస్తానన్న నమ్మకం ఉంది..’ అని బీజేపీలో చేరిన సందర్భంగా సైనా పేర్కొన్నారు.

చదవండి:
హీరోతో గుత్తా జ్వాల.. ఫోటోలు వైరల్‌

మాటలు రావడం లేదు: కోబీ భార్య భావోద్వేగం

మరిన్ని వార్తలు