అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలి: సుచరిత

20 Jan, 2020 18:25 IST|Sakshi

సాక్షి, అమరావతి: పరిపాలన వికేంద్రీకరణ బిల్లుకు హోంమంత్రి మేకతోటి సుచరిత పూర్తి మద్దతు తెలిపారు. ఇదొక చరిత్రాత్మక రోజు, శతాబ్దాల రాష్ట్ర భవిష్యత్తుకు చక్కని పునాది అని ఆమె కొనియాడారు. ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ప్రత్యేక సమావేశాల్లో పరిపాలన వికేంద్రీకరణ బిల్లుపై సుచరిత మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పాటైన దగ్గరి నుంచి కులాలు, మతాలు, ప్రాంతాలకతీతంగా అందరి అభివృద్ధి, సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో ప్రజాసంక్షేమం మంచి నిర్ణయాలు తీసుకుంటున్నామని తెలిపారు.


ప్రాంతీయ అసమానతలు, అనుమానాలకు తావులేని అభివృద్ధి జరగాలని, అన్ని ప్రాంతాల ఆకాంక్షలను, అభిప్రాయాలను గౌరవించాలని, అందుకు చట్టసభలు వేదికగా కావాలని, అప్పుడే ప్రజల ఆకాంక్షలు సజీవంగా ఉండి.. అన్ని ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధి జరుగుతుందని అన్నారు. అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలని, అందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని, ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తూ.. లబ్ధిదారులకు సేవలన్నీ తమ గడప వద్దకే తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. పరిపాలన వికేంద్రీకరణ దిశగా తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలోనే సరికొత్త విప్లవానికి నాంది పలుకనుందని ధీమా వ్యక్తం చేశారు. ఇలాంటి గొప్ప నిర్ణయాలు అమలు చేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌ నాయకత్వంలో పనిచేయడం నిజంగా తమకు గర్వకారణంగా ఉందన్నారు.

చదవండి:

చంద్రబాబుకు సవాల్‌ విసిరిన కొడాలి నాని

రాజధానులు ఎంతెంత దూరం

శాసనాలు చేసే రాజధానిగా అమరావతి

రాజధాని రైతులకు వరాలు

72 ఏళ్లు గడిచినా రాజధాని కూడా లేదు...

స్పీకర్‌ వినతి.. కచ్చితంగా విచారణ జరిపిస్తాం: సీఎం

మరిన్ని వార్తలు