ప్రతిపక్ష హోదాలో కాంగ్రెస్‌ ఏం చేసింది?

21 Oct, 2018 02:55 IST|Sakshi

బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు

సాక్షి, హైదరాబాద్‌: అవినీతి, అక్రమాలపై మాట్లాడుతున్న కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన ప్రతిపక్షం హోదాలో చేసిందేమిటో ప్రజలకు వివరించాలని బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు డిమాండ్‌ చేశారు. శనివారం బీజేపీ భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈ నాలుగున్నరేళ్లలో టీఆర్‌ఎస్‌ చేసిన అవినీతిపై కాంగ్రెస్‌ పార్టీ కనీసం ఒక్క ధర్నా అయినా చేసిందా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ అవినీతిపై కోర్టుల్లో కేసు లు వేసి కాంగ్రెస్‌ చేతులు దులుపుకుందని, తీరా ఇప్పుడు మాత్రం అవినీతి అంటూ నానాయాగీ చేయటం బాలేదని విమర్శించారు.  

‘రేవంత్‌రెడ్డి ఓ రౌడీషీటర్‌’
సాక్షి, హైదరాబాద్‌: టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి రౌడీషీటర్‌ అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహారావు ఆరోపిం చారు. శనివారం ఇక్కడి బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఐటీ సోదాలతో రేవంత్‌ అసలు స్వరూపం బయటపడిందన్నారు.

రేవంత్‌రెడ్డిపై ఐటీ రిపోర్ట్‌ బయటకు వచ్చిందని, ల్యాండ్‌ సెటిల్‌మెంట్లు, భూకబ్జాల తో కోట్లాది రూపాయలు సంపాదించారని ఆరోపించారు. రేవంత్‌ మామ దగ్గర రూ.11 లక్షలు, బావమరిది దగ్గర 1.2 కిలోల బంగారాన్ని ఐటీ అధికారులు సీజ్‌ చేశారన్నారు. కేఎల్‌ఎస్‌ఆర్‌ ఇన్‌ఫ్రాటెక్‌ డైరెక్టర్‌ శ్రీధర్‌రెడ్డి దగ్గర రూ.1.40 కోట్లు దొరికాయని, కేఎల్‌ఎస్‌ఆర్‌ అనేది బినామీ సంస్థగా తేలిపోయిందన్నారు.

మరిన్ని వార్తలు