కాంగ్రెస్‌ నేతలపై ఐటీ దాడులు.. పొంగులేటి స్ట్రాంగ్‌ కౌంటర్‌

9 Nov, 2023 12:00 IST|Sakshi

సాక్షి, ఖమ్మం: కాంగ్రెస్‌ నేత పొంగులేటి శ్రీనివాస రెడ్డి నివాసాల్లో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఐటీ దాడులపై పొంగులేటి స్పందించారు.  తనను ఇబ్బంది పెట్టేందుకే ఐటీ దాడులు జరుగుతున్నాయన్నారు. ఈ దాడులపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు. 

కాగా, తాజాగా పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ..‘కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాంగ్రెస్ నాయకులపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాయి. వేల కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం, నాయకుల వద్ద ఉన్నాయి. వారిపై దాడులు చేయకుండా.. నాపై, కాంగ్రెస్‌ నేతలపై దాడులు చేస్తున్నారు. ఇది హేయమైన చర్య. నాపై ఫోకస్‌ పెట్టి ఇబ్బందులు పెడుతున్నారు. తనను విమర్శించే వారిని వేధించడం కేసీఆర్‌కు అలవాటే. . బీఆర్‌ఎస్‌ లక్షల రూపాయలు ఖర్చు చేస్తుంటే తనిఖీలు ఎందుకు చేయడంలేదు. 

ఐటీ దాడులు ఊహించినవే. కాంగ్రెస్‌ నేతలే టార్గెట్‌ ఐటీ దాడులు జరుగుతున్నాయి. కాంగ్రెస్‌ నేతలపైనే దాడులపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం. ఈరోజు నేను నామినేషన్‌ దాఖలు చేయాలి. నామినేషన్ దాఖలు చేసే అధికారం ప్రతి ఒక్కరికీ ఉంటుందని తెలిపారు. అర చేతిని అడ్డు పెట్టుకుని సూర్యకాంతిని ఆపలేరు. తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయం’ అని కామెంట్స్‌ చేశారు. 

ఇది కూడా చదవండి: పొలిటికల్‌ గేమ్‌.. పొంగులేటి ఇంట్లో ఐటీ సోదాలు

మరిన్ని వార్తలు