‘పరిపాలన స్తంభింప చేసే హక్కు ఈసీకి ఎక్కడుంది’

17 Mar, 2020 18:27 IST|Sakshi

సాక్షి, కాకినాడ: చంద్రబాబు రాజకీయ జీవితమంతా కుట్రలే అని మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ఎన్నికల కమిషనర్ తరఫున చంద్రబాబు మాట్లాడటం ఆశ్చర్యకరమని..ఎన్నికల కమిషనర్ పక్షపాత వైఖరి అవలంభించారని ఆయన మండిపడ్డారు. కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రం సంక్షేమం దిశగా వెళ్తుందనే చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు తిరస్కరించారనే అక్కసు చంద్రబాబుకు ఉందన్నారు. ప్రజలు బుద్ధి చెప్పినా చంద్రబాబులో మార్పు లేదని ఆయన మండిపడ్డారు.

పరిపాలన స్తంభింప చేసే హక్కు ఈసీకి ఎక్కడుందని కురసాల కన్నబాబు ప్రశ్నించారు. మీ ఇష్టానుసారం ఆదేశాలు ఎలా ఇస్తారని కన్నబాబు నిలదీశారు. ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే ధీమాతో బాబు ఉన్నారని ఆయన ధ్వజమెత్తారు. కుల ఉన్మాదం చంద్రబాబులో మాత్రమే ఉందని కన్నబాబు మండిపడ్డారు. చంద్రబాబు కుల ఉన్మాదం ఖండాంతరాలకు వ్యాపించిందని విమర్శించారు. అధికారం పోయిందనే నిరాశతో టీడీపీ నేతలు ఉన్నారని ఆయన అన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైఎస్సాఆర్‌సీపీ సత్తా చాటుతుందని కన్నబాబు ఆశావాదం వ్యక్తం చేశారు. వ్యవస్థలోని వ్యక్తులు తప్పులు చేస్తే ప్రశ్నిస్తామని ఆయన స్పష్టం చేశారు.

>
మరిన్ని వార్తలు