కరీంనగర్ కార్పోరేషన్‌పై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం

2 Jan, 2020 15:31 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌ : మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సెలెక్ట్ ఎలక్ట్ పద్ధతిలో అభ్యర్థులను ఎంపిక చేస్తామని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. ఆశావాహులు కాంగ్రెస్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గురువారం పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ.. అభ్యర్థుల ఎంపికకు 15 మంది సభ్యులతో కమిటీ వేశామని అన్నారు. ఎంత మంది పార్టీని వీడినా, ఆఖరికి తాను కూడా వెళ్లినా కాంగ్రెస్ జీవనదిలాంటిదన్నారు. కరీంనగర్ కార్పోరేషన్‌పై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాని పేర్కొన్నారు. ప్రతిపక్షాలను గెలిపిస్తే అభివృద్ధి ఆగుతుందని మంత్రి చెప్పడం అవాస్తవమని అన్నారు. కరీంనగర్లో టీఆర్‌ఎస్‌ సాధించిన అభివృద్ధిపై చర్చకు మంత్రి గంగుల సిద్ధమా అని సవాల్‌ విసిరారు. లండన్, న్యూయార్క్‌ లాగా కరీంనగర్‌ను చేస్తానన్న కేసీఆర్.. ఇప్పుడు వేములవాడ దగ్గరున్న నీటిని చూపిస్తున్నాడని ఎద్దేవా  చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. (జిల్లాల వారీగా కోఆర్డినేటర్ల నియామకం)

దేశానికి కాంగ్రెస్ మాత్రమే రక్ష అని,  మత విధ్వేషాలు రెచ్చగొడుతూ టీఆర్ఎస్, బీజేపీ ఆశాంతికి కారణమవుతున్నాదని ఆరోపించారు. కరీంనగర్‌లో పార్టీకి నష్టం కలగకుండా తొందరలోనే కమిటీ వేయాలని పార్టీని కోరారు. తాను నామినేషన్ వేసినప్పుడు రానోళ్లు ఈ పార్టీలో ఉన్నా ఒకటే లేకున్నా ఒకటేనని వ్యాఖ్యానించారు. ఎవరున్నా..లేకున్నా పార్టీకి జరిగే నష్టమేమీ లేదన్నారు. ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని విమర్శించారు. వార్డుల విభజనలో అభ్యంతరాలు తీసుకున్నా.. వాటిని  పరిగణలోకి తీసుకోలేదని మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల టికెట్లలో తాను ఎవరికీ సిఫారసు చేయనని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు