‘ఆసరా’ ఎప్పుడు?: ఆర్‌. కృష్ణయ్య

2 Mar, 2018 04:49 IST|Sakshi

పింఛను రూ.2 వేలకు పెంచాలని డిమాండ్‌  

సాక్షి, హైదరాబాద్‌: ఆసరా పింఛన్ల పంపిణీలో జాప్యంపై బీసీ సంక్షేమ సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. లబ్ధిదారులకు వెంటనే పింఛన్లు ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం నేత, టీటీడీపీ ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. వరుసగా మూడు నెలల నుంచి పింఛను డబ్బులు ఇవ్వకపోవడంతో వృద్ధులు, వికలాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు.

పింఛన్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా 35 లక్షల మంది లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారని, పింఛను ఎప్పుడిస్తారని అధికారులను ప్రశ్నించినా సమాధానం రావడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పింఛను పంపిణీ తేదీలను ప్రకటించాలని, అదేవిధంగా తాజా బడ్జెట్‌లో పింఛన్‌ డబ్బులను రూ.2వేలకు పెంచాలని డిమాండ్‌ చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో ఈమేరకు పెంపు అనివార్యమన్నారు.

మరిన్ని వార్తలు