మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి సరికొత్త హామీ.. ‘సీఎం రైజ్‌’ స్కూళ్లు

12 Nov, 2023 22:01 IST|Sakshi

Madhya Pradesh Elections: మరికొన్ని రోజులలో ఎన్నికలు జరగనుండగా మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ సరికొత్త హామీ ఇచ్చారు. గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రతి 25-30 గ్రామాలకు ఒక ‘సీఎం రైజ్‌’ స్కూల్‌ను ఏర్పాటు చేస్తామన్నారు.

సాగర్‌ జిల్లాలో ప్రచార ర్యాలీలో సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ మాట్లాడారు. ఈ స్కూల్‌కు వచ్చి వెళ్లేందుకు విద్యార్థులకు ఉచిత బస్సుతోపాటు మరిన్ని సదుపాయాలు కల్పిస్తామన్నారు. ‘రాష్ట్రంలోని ప్రతి 25-30 గ్రామాలకు ఒక ‘సీఎం రైజ్‌’ స్కూల్‌ను ఏర్పాటు చేస్తాం. ఇక్కడ లైబ్రరీ, ల్యాబ్‌లు, స్మార్ట్‌ క్టాస్‌రూమ్‌లతో పాటు విద్యార్థులను స్కూల్‌కి తీసుకొచ్చి, ఇంటికి చేర్చేందుకు బస్సులు ఉంటాయి. ఇవన్నీ ఉచితమే’ అని ఆయన పేర్కొన్నారు.

మధ్యప్రదేశ్‌లో నవంబర్‌ 17న అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో  శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ఈ ప్రకటన చేశారు. మొత్తం 230 అసెంబ్లీ స్థానాలకు ఇక్కడ  ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్‌ 3న కౌంటింగ్‌ జరుగుతుంది. కాగా సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ బుద్ని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. 1990 నుంచి ఆయన ఇక్కడ ఐదు పర్యాయాలు పోటీ చేసి గెలుపొందారు.

మరిన్ని వార్తలు