ఈఎస్‌ఐ స్కామ్‌లో లోతుగా దర్యాప్తు జరగాలి: స్పీకర్‌

13 Jun, 2020 16:47 IST|Sakshi

సాక్షి, విజయవాడ : ఈఎస్ఐ‌ కుంభకోణంలో ముందుల కొనుగోలులో అవకతవకలు జరిగాయని ఏసీబీ నిర్ధారించిందని ఆంధ్రప్రదేశ్‌ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. ఆధారాలు ఉన్నందునే అచ్చెన్నాయుడిని అరెస్టు చేశారని ఆయన పేర్కొన్నారు. విజయవాడలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అచ్చెన్నాయుడు అరెస్టుపై శాసనసభాపతి‌గా తనకు సమాచారం అందించారని తెలిపారు. ఈఎస్‌ఐ స్కామ్‌లో లోతుగా దర్యాప్తు జరగాలని, ఈ వ్యవహారంలో ఉన్న వారందరి బండారం బయటపెట్టాలని  స్పీకర్‌ కోరారు. (జేసీ దివాకర్‌రెడ్డిని కూడా అరెస్ట్‌ చేయాలి)

ఈఎస్‌ఐ కుంభకోణంలో వందల కోట్లు పక్క దారి మళ్లించారని తమ్మినేని విమర్శించారు. అక్రమ సంపాదనను మనీలాండరింగ్ ద్వారా మళ్లించారని, అచ్చెన్నాయుడు బీసీ అయితే ఆయన చేసిన నేరాన్ని వదిలేయాలా అని​ ప్రశ్నించారు. అచ్చెన్నాయుడు తప్పు చేస్తే చంద్రబాబు బీసీలందరికీ ఆపాదిస్తున్నారని మండిపడ్డారు. నేరాలకు, బీసీలకు లింకు పెడుతూ రాజకీయాలు చేస్తున్నారని, నేరాలకు, బీసీలకు సంబంధమేంటి అని చంద్రబాబును స్పీకర్‌ నిలదీశారు. (రమ్యకృష్ణ కారు డ్రైవర్‌ అరెస్ట్‌)

మరిన్ని వార్తలు