రెండు ఎంపీటీసీలకు రీపోలింగ్‌

8 May, 2019 04:41 IST|Sakshi

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి ఆదేశాలు 

బ్యాలెట్‌ పత్రాలు కలసిపోవడంతో నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో రెండు ఎంపీటీసీ స్థానా ల్లో రీపోలింగ్‌ జరగనుంది. సోమవారం జరిగిన మొదటి విడత పరిషత్‌ ఎన్నికల్లో భాగంగా అభ్యర్థుల బ్యాలెట్‌ పత్రాలు కలసిపోవడంతో ఈ స్థానాల విష యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఈ నిర్ణయం తీసు కుంది. రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్‌ మండ లం అజీజ్‌నగర్‌ ఎంపీటీసీ, సిద్దిపేట జిల్లా మిర్‌దొడ్డి మండలం అల్వాల్‌ ఎంపీటీసీ స్థానాలకు ఈ నెల 14 న మూడో విడత ఎన్నికల్లో భాగంగా రీపోలింగ్‌ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ వి.నాగిరెడ్డి ఆదేశించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక ఎంపీటీసీ స్థానంలో బ్యాలెట్‌పత్రాలు కలసిపోయినా, దీన్ని సకాలంలో గుర్తించడంతో సోమవారమే సరిచేసి ఎన్నికలు నిర్వహించారు.

రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లోని ఈ రెండు ఎంపీటీసీ స్థానాల్లో ఓటర్లకు తప్పుడు బ్యాలెట్‌ పేపర్లను పంపిణీ చేసిన నేపథ్యంలో మళ్లీ ఎన్నికల నిర్వహణకు నోటి ఫికేషన్‌ జారీచేయాలని అధికారులను ఎస్‌ఈసీ ఆదేశించింది. ఈ స్థానాల్లోని ఓటర్లకు ఈ నెల 14న నిర్వహించే రీపోలింగ్‌ సందర్భంగా ఎడమ చేతి నాలుగో వేలిపై సిరాచుక్క వేయాలని సూచించింది. కాగా, పరిషత్‌ ఎన్నికల్లో భాగంగా తనిఖీల సందర్భంగా ఇప్పటివరకు రూ.1.6 కోట్ల విలువైన నగదు, మద్యం, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ఒక్కరోజే రూ.3.95 లక్షల నగదు, రూ.1.6 లక్షల విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు 86 ఫిర్యాదులందాయి. మొత్తం 190 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి వాటిపై చర్యలు చేపట్టినట్లు ఎస్‌ఈసీకి పోలీస్‌ శాఖ తెలిపింది.

మరిన్ని వార్తలు