కాంగ్రెస్‌ ఆరోపణలను ఖండించిన టీఆర్‌ఎస్‌

16 Apr, 2018 15:38 IST|Sakshi
రాములు నాయక్‌

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే ఎన్నికల్లలో అధికారంలోకి వస్తామని కాంగ్రెస్‌ పార్టీ పగటికలలు కంటోందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ రాములు నాయక్‌ విమర్శించారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే రెడ్యా నాయక్ గంజాయి, ఇసుక మాఫియాకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. కాంగ్రెస్‌ నేతలు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు.

గిరిజనులు, దళితులకు కాంగ్రెస్‌ ఎప్పుడు అన్యాయమే చేసిందన్నారు. కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న బస్సు యాత్రతో ఒరిగే ప్రయోజనమేమీ లేదని ఆయన తెలిపారు. దేశంలో ఎక్కడా జరగని అభివృద్ధి తెలంగాణలో జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలే టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తాయని ఆయన స్పష్టం చేశారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు