తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు భవిష్యత్తు లేదు: భట్టి

16 Nov, 2023 14:28 IST|Sakshi

సాక్షి, ఖమ్మం: తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పార్టీకి భవిష్యత్తు లేదని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. నవంబర్‌ 30 తరువాత రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ఉండదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ప్రజలు నిర్ణయించారని తెలిపారు. ఆరు గ్యారంటీలను ప్రభుత్వం ఏర్పాటైనా 100 రోజుల్లో అమలు చేస్తామని పేర్కొన్నారు.

ఖమ్మం జిల్లా మధిర మండలంలో భట్టి విక్రమార్క గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాక్టర్ నడిపి కార్యకర్తలను ఉత్సాహపరిచారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ 10 సంవత్సరాలు రాష్ట్ర సంపదను దోచుకున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ప్రజలు వదిలించుకోవాలనుకుంటున్నారని అన్నారు. రామచంద్రపురం గ్రామంలో  బీఆర్ఎస్ పార్టీ నుంచి భట్టి  సమక్షంలో 30 కుటుంబాలు కాంగ్రెస్‌లో చేరాయి.
చదవండి: ‘అది వదంతి మాత్రమే.. ఆ వార్తలను నమ్మకండి’

మరిన్ని వార్తలు