టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు

11 Mar, 2018 16:58 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : అధికార టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ వీడింది. ఆ పార్టీ రాజ్యసభ అభ్యర్థులను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. బండ ప్రకాశ్ ముదిరాజ్ (వరంగల్), సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్ (నల్లగొండ) లను అభ్యర్థులుగా కేసీఆర్ ప్రకటించారు. రేపు టీఆర్ఎస్‌ అభ్యర్థులు నామినేషన్ వేయనున్నారు. అంతకుముందు కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరిగింది. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో పార్టీ అభ్యర్థుల ఖరారు విషయంపై పార్టీ నేతలతో కేసీఆర్ చర్చించారు. అనంతరం పార్టీ అభ్యర్థులుగా బండ ప్రకాశ్ ముదిరాజ్ (వరంగల్), సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్ (నల్లగొండ)ల పేర్లు ఖరారు చేసినట్లు ప్రకటించారు. 

కాగా, రాష్ట్రంలోని మూడు ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు అనివార్యమైతే ఈ నెల 23న పోలింగ్‌ జరగనుంది. ఎమ్మెల్యేలు ఓటర్లుగా ఉన్న రాజ్యసభ ఎన్నికల్లో ప్రస్తుతమున్న ఎమ్మెల్యేల బలం ప్రకారం మూడు స్థానాలు టీఆర్‌ఎస్‌ ఖాతాలోనే పడనున్నాయి. ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్నిబట్టి రాజ్యసభ ఎన్నికలు ఇప్పటిదాకా ఏకగ్రీవం కావడం సంప్రదాయంగా వస్తోంది. రాజ్యసభకు ఓపెన్‌ బ్యాలెట్‌ ద్వారా ఎన్నికలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు