బంగారు నగల సేకరణకు దిగారు..

14 Jan, 2020 12:59 IST|Sakshi

చంద్రబాబు నాయుడుపై విజయసాయిరెడ్డి విమర్శలు

సాక్షి, అమరావతి: తన ఐదేళ్ల పాలనాకాలంలో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌ను సర్వనాశనం చేశారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ప్రజలను మోసం చేయడం, లూటీ చేయడం తప్ప ఆయన సాధించింది ఏమీలేదని విమర్శించారు. ఇప్పుడు ఉత్తుత్తి ఉద్యమాన్ని ప్రారంభించి రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం కోల్పోవడాన్ని తట్టుకోలేక ప్రతీకార చర్యలకు దిగుతున్నారని విమర్శించారు. మీరు ఏపీ ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకమా లేదా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాపులారిటీకి వ్యతిరేకమా అని చంద్రబాబును ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.(ఇన్‌సైడర్‌ కిరికిరిలో దొరికిపోయి మాటలా..!)

అదే విధంగా... అభివృద్ధి వికేంద్రీకరణకు అడ్డుపడుతూ టీడీపీ చేస్తున్న ఉద్యమాన్ని ప్రస్తావిస్తూ... ‘ అమరావతిని ఎలా మారుస్తారని పళ్లు కొరికారు.  ప్రభుత్వం కూలిపోతుందని శాపాలు పెట్టారు. ఉత్తుత్తి ఉద్యమాన్ని ప్రారంభించారు. బంగారు నగల సేకరణకు దిగారు. తర్వాత జోలెతో ఊరూరూ తిరుగుతున్నారు. ఆఖరున వచ్చిన డబ్బును పంచుకుని ఎవరి దారిన వాళ్లు వెళ్లి పోతారు’ అని విజయసాయిరెడ్డి విమర్శించారు.

మరిన్ని వార్తలు