'వైఎస్‌ జగన్‌ కర్తవ్య నిర్వహణ చాలా బాగుంది'

20 Dec, 2019 21:36 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : రాజధానిపై జీఎన్‌ రావు కమిటీ ఇచ్చిన నివేదిక సంతోషకరమైనదిగా ఉందంటూ బీజేపీ సీనియర్‌ నేత విష్ణుకుమార్‌ రాజు పేర్కొన్నారు. కాగా కమిటీ ఇచ్చిన నివేదిక రాష్ట్ర సమగ్రాభివృద్ధిని సూచించే విధంగా ఉందంటూ ప్రశంసించారు. కమిటీ ఇచ్చిన నివేదికను నిర్లక్ష్యం చేయకుండా అందరు స్వాగతించాల్సిన విషయమని వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జీఎన్‌ రావుతో రాష్ట్రమంతా సర్వే చేయించారని, ఒకవేళ నివేదికకు అనుకూలంగా పనిచేస్తే త్వరలోనే ఉత్తరాంధ్ర సస్యశామలమవుతుందని అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం ఉన్న ఆర్థిక వనరుల దృష్యా ఇది అద్భుత విజయమని, ఇది ఒక్క జగన్‌కే సాధ్యమైందని ఆయన వెల్లడించారు.' విశాఖకు చెందిన వాడిగా నేను దీనిని సమర్థిస్తున్నా. ఇందులో ఎలాంటి రాజకీయం లేదని' ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో టీడీపీతో కలిసి పని చేసినప్పుడు తాను రాజధానికి 35 వేల ఎకరాలు ఎందుకు అని ప్రశ్నించినట్లు గుర్తుచేశారు. కానీ మా వాదన పట్టించుకోకుండా రైతులను మభ్యపెట్టి చివరకు తాత్కాలిక భవనాలు నిర్మించారు. టీడీపీ హయాంలో ఉత్తరాంధ్ర నుంచి మంత్రిగా అచ్చెనాయుడు పని చేసినప్పటికి శ్రీకాకుళం ప్రాంతం అభివృద్ధి చెందలేదని వివరించారు. వైఎస్‌ జగన్‌ మొండి మనిషి అనుకున్నా, కానీ కర్తవ్య నిర్వహణను ఫెంటాస్టిక్‌గా చేస్తున్నారని ప్రశంసించారు. 

మరిన్ని వార్తలు