అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి 

15 Nov, 2023 10:53 IST|Sakshi

చిన్నంబావి: అనుమానాస్పదంగా యువకుడు మృతిచెందిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ ఓబుల్‌ రెడ్డి తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రంలో రత్నగిరి కాలనీలో నివాసం ఉంటున్న కాటం మల్లేష్‌(30) పెద్దదగడకి చెందిన మణెమ్మతో కలిసి ఇక్కడే నివాసం ఉంటున్నాడు.

సోమవారం రాత్రి అతిగా మద్యం తాగి గుండెపోటుకు గురై మృతిచెంది ఉంటాడని, తమ ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. తండ్రి వెంకటస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, పూర్తిస్థాయిలో విచారణ చేపడుతున్నామన్నారు.

మరిన్ని వార్తలు