తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు-2023.. టుడే అప్‌డేట్స్‌

15 Nov, 2023 21:56 IST|Sakshi

Telangana Assembly Elections.. Updates

బీజేపీకి విజయశాంతి రాజీనామా
►తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ.. బీజేపీకి మరో ఎదురు దెబ్బ
►పార్టీకి విజయశాంతి రాజీనామా
►రాజీనామా లేఖను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి పంపిన విజయశాంతి 
►గత కొంత కాలంగా ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాల పట్ల ఆమె అసంతృప్తి! 
►విజయశాంతి కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం

విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు.. నేను కూడా సెంచరీ కొట్టడానికి తిరగాలి: కేటీఆర్‌
►కేసీఆర్‌కు రెండు సార్లు అవకాశం ఇచ్చారు 
►దేశంలో వడ్లు పండించడంలో తెలంగాణ నంబర్ 1గా తయారైంది.
►మళ్ళీ కాంగ్రెస్ కు అవకాశం ఇస్తే బస్మాసుర హస్తమే
►55 ఎండ్లు పరిపాలించిన కాంగ్రెస్ మళ్ళీ అవకాశం ఇద్దమా..?
►తంగళ్లపల్లి మండల కేంద్రంలో రోడ్ షో లో పాల్గొన్న మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.
►మళ్ళీ అవకాశం ఇస్తే భారత దేశంలోనే సిరిసిల్లను నంబర్ వన్ గా చేస్తా
►డిసెంబర్ 3 తర్వాత అసైన్డ్ భూములకు హక్కులు కల్పిస్తాం.
►ఎం మారిందో చూడండి సిరిసిల్ల, బ్రిడ్జి కింద 24 గంటల నీళ్లు సముద్రంలాగా ఉన్నాయి.
►ఇవ్వాళ మనకు పోటీ ఉన్నది చూడండి ఒక దిక్కు కాంగ్రెస్ మరో దిక్కు బీజేపీ
►సిద్దిపేటకు రైల్ వచ్చింది, త్వరలో సిరిసిల్ల కు రైలు కుతా వినిపిస్తది.

కేసీఆర్ పై  రేఖానాయక్ వివాదాస్పద వ్యాఖ్యలు 
►సీఎం  కేసీఆర్ పై  ఖానాపూర్‌   ఎమ్మెల్యే   రేఖానాయక్   అభ్యంతరకర వ్యాఖ్యలు 
►అన్ని అర్హతలు ఉన్నా  మహిళలకు  పెన్షన్  ఇవ్వడం  లేదంటూ...... వ్యాఖ్యలు
►అసిపాబాద్ జిల్లా  కవాడిగూడలో  అమె   భర్త కాంగ్రెస్ అభ్యర్థి   శ్యామ్ నాయక్   తరపున ఎన్నికల ప్రచారం

కరీంనగర్‌లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యలు
►కరీంనగర్‌లో బీజేపీదే గెలుపు.. రెండో స్థానం కోసమే కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీ 
►గంగుల ఓటుకు రూ.10 వేలు, లక్ష సెల్ ఫోన్లను నమ్ముకున్నడు
►నేను ధర్మాన్ని, ప్రజలను, కార్యకర్తలను నమ్ముకున్న
►ఓట్లు, సీట్ల కోసం ఎంతకైనా దిగజారే పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్
►అధికారం కోసం రౌల్ విన్సీ... రాహుల్ గాంధీ అయ్యిండు
►కల్వకుంట్ల అజయ్ రావు... కేటీఆర్‌గా మారిండు
►కరీంనగర్ కమలాకర్... దారుస్సలాంకు పోతే కమ్రుద్దీన్‌గా మారుతున్నడు
►కరీంనగర్ అభివృద్ధికి కేంద్రం ఏం చేసిందో బహిరంగ చర్చకు సిద్ధం
►ఎంపీగా గెలిపిస్తే.. ప్రజలు గర్వపడేలా కేసీఆర్ పై యుద్దం చేసిన

గజ్వేల్ బరిలో 44మంది అభ్యర్థులు
►ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ బరిలో 44మంది అభ్యర్థులు
►నామినేషన్ల పరిశీలన తరువాత 70మంది అభ్యర్థుల ఉపసంహరణ
►44మంది అభ్యర్థులకు మూడు బ్యాలెట్లు అవసరం పడుతాయంటున్న ఎలక్షన్ కమిషన్ అధికారులు

రేపు కేసిఆర్ ఎన్నికల ప్రచారం షెడ్యూల్
►రేపు ఆదిలాబాద్, బోథ్, నిజామాబాద్ రూరల్, నర్సాపూర్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారం

మల్లు భట్టి విక్రమార్కకు మద్దతు ప్రకటించిన టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాసిరెడ్డి రామనాథం
►ఖమ్మం జిల్లా మధిర అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మల్లు భట్టి విక్రమార్కకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాసిరెడ్డి రామనాథం
►భట్టి విక్రమార్క గెలుపుకు సంపూర్ణ సహకారం అదించాలని తీర్మానం

మహేశ్వరం నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ నేతల మధ్య ఘర్షణ
మహేశ్వరం నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ నేతల మధ్య ఘర్షణ
►కుర్చీలతో కొట్టుకున్న నేతలు

ఈనెల 17న తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన  
►ఒకే రోజు 5 నియోజకవర్గాలను చుట్టేయనున్న రాహుల్ గాంధీ 
►ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్న రాహుల్ గాంధీ
►శంషాబాద్ నుంచి హెలికాఫ్టర్‌లో ఉదయం 11 గంటలకు పినపాకకు చేరుకోనున్న రాహుల్
►మధ్యాహ్నం 12 గంటల వరకు పినపాకలో రోడ్ షో కార్నర్ మీటింగ్..
►పినపాక నుంచి హెలికాప్టర్లో నర్సంపేటకు చేరుకోనున్న రాహుల్ గాంధీ
►మధ్యాహ్నం రెండు నుంచి మూడు గంటల వరకు  నర్సంపేట లో ఉన్న రాహుల్ గాంధీ
►నర్సంపేట నుంచి రోడ్డు మార్గం ద్వారా వరంగల్ ఈస్ట్‌కు చేరుకోనున్న రాహుల్ గాంధీ
►వరంగల్ ఈస్ట్ లో సాయంత్రం నాలుగు గంటలకు  పాదయాత్ర చేయనున్న రాహుల్ గాంధీ
►వరంగల్ ఈస్ట్ నుంచి వెస్ట్ కు వెళ్ళనున్న రాహుల్ గాంధీ
►సాయంత్రం 6:30 గంటలకు రోడ్డు మార్గం ద్వారా  హైదరాబాద్ రాజేంద్రనగర్ రానున్న రాహుల్ గాంధీ
►రాజేంద్రనగర్ సమావేశం అనంతరం ఢిల్లీ వెళ్లనున్న రాహుల్ గాంధీ

మెదక్ సభలో సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు
►ఎన్నికలు వచ్చాయంటే ఇష్టం వచ్చినట్టు నాయకులు వాగ్దానాలు ఇస్తున్నారు
►నాయకుల చరిత్ర, పార్టీల వైఖరి కూడా మీరు చూడాలి
►ప్రజల చేతిలో ఉండే పెద్ద ఆయుధం ఓటు
►మంచివాళ్ళకి ఓటు వేస్తే మంచి జరుగుతుంది
►బీఆర్‌ఎస్ తెలంగాణ సాధన కోసం పుట్టిన పార్టీ
►బీఆర్‌ఎస్‌ వచ్చినప్పుడు తెలంగాణలో తాగు, సాగు నీళ్లు లేవు, రైతుల ఆత్మహత్యలే ఉన్నాయి.
►కానీ ఈ పదేళ్లలో బీఆర్‌ఎస్‌ ఏం చేసిందో మీరు గమనించాలి
►సంక్షేమంలో తెలంగాణ దేశంలో నెంబర్ వన్
►కాంగ్రెస్ పార్టీ వస్తే పెద్ద ప్రమాదం వస్తుంది
►రైతు బంధు ఇచ్చి డబ్బులు దుబారా చేస్తున్నారు అని కాంగ్రెస్ వాళ్లు చెబుతున్నారు
►రైతు బంధు 16 వేలకు పెంచుతున్నాం
►కాంగ్రెస్ వస్తే ధరణి తీసేస్తామని కాంగ్రెస్ అగ్రనేతలు చెబుతున్నారు
►ధరణి తీసేస్తే రైతు బంధు, రైతు భీమా బంద్ అవుతాయి

మరోసారి కేసీఆర్‌కు హెలికాఫ్టర్‌ ట్రబుల్‌
►సీఎం కేసీఆర్‌ ప్రయాణించే హెలికాఫ్టర్‌లో సాంకేతిక లోపం
►గుర్తించి అప్రమత్తమైన సిబ్బంది
► ఎన్నికల ప్రచారంలో.. ఇలా జరగడం ఇది మూడోసారి
►ఇంతకు ముందు మహబూబ్‌ నగర్‌, ఆదిలాబాద్‌, ఇప్పుడు మెదక్‌లో మొరాయించిన హెలికాఫ్టర్‌

సీఈఓ వికాస్ రాజ్‌ను కలిసిన రాజాసింగ్
►సీఈఓ వికాస్ రాజ్‌ను కలిసిన గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్
►గోషామహల్ నియోజకవర్గం బూత్‌లలో రెగ్గింగ్ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వినతి పత్రం ఇచ్చిన రాజాసింగ్
►గోషామహల్ నియోజకవర్గంలో లాస్ట్ టైం రెగ్గింగ్ జరిగింది.
►ఈ సారి అలా జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరాం.
►ప్రతీ పోలింగ్ కేంద్రం వద్ద సీసీటీవీ, పోలీస్, సెంట్రల్ ఫోర్సెస్ ఉంచాలని కోరాం
►కొంతమంది పోలీస్ అధికారులు బీజేపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారు.
►పోలింగ్ టైంలో బూత్ లోకి ఎవరు వచ్చినా ఐడీ కార్డ్ చూపించేలా చర్యలు తీసుకోవాలి.

రెబల్స్ తో కాంగ్రెస్ చర్చలు సఫలం..
►నామినేషన్ విత్ డ్రా చేసుకున్న పలువురు నేతలు
►సూర్యాపేట.. పటేల్ రమేష్ రెడ్డి
►జుక్కల్.. గంగారం
►బాన్సువాడ... బాలరాజు
►డోర్నకల్ ...నెహ్రూ నాయక్ 
►వరంగల్ వెస్ట్..జంగా రాఘవ రెడ్డి
►ఇంబ్రహింపట్నం.. దండెం రాంరెడ్డి

2024లో దేశంలో సంకీర్ణ సర్కారు ఖాయం:కేసీఆర్‌
►నిజామాబాద్ బీఆర్ ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ కామెంట్స్
►సింగూరు నీటిని నిజాం సాగర్ కు తరలించాం
►నిజామాబాద్ కు ఐటి హబ్ తెచ్చాం
►కాంగ్రెస్ వస్తే భయంకర పరిస్థితులు వస్తాయి
►కాంగ్రెస్, బీజేపీ లు బీడీ కార్మికులను పట్టించుకోలేదు
►2014 తర్వాత చేరిన కొత్త బీడీ కార్మికులందరికి పింఛన్ ఇస్తాం
►మళ్ళీ అధికారంలోకి వస్తే అన్ని రకాల పింఛన్లను 5016 కుపెంచుతాం
►ముస్లిం మైనార్టీ లను కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా వాడుకుంది. మత కలహాలు సృష్టించింది
►హిందూ, ముస్లింలు సోదరభావంతో ఉన్నారు
►బీజేపీ మత పిచ్చితో మంటలు పెడుతోంది
►వంద ఉత్తరాలు రాసినా కేంద్రం ఒక్క మెడికల్ కాలేజి గాని నవోదయ పాఠశాల గాని ఇవ్వలేదు
►ప్రధాని మోడీ తెలంగాణ వ్యతిరేకి
►రెండు జాతీయ పార్టీలు తెలంగాణను పట్టించుకోలేదు
►2024లో దేశంలో సంకీర్ణ సర్కారు ఖాయం
►బీఆర్‌ఎస్ కీలక పాత్ర పోషిస్తుంది

బీఆర్‌ఎస్‌ ఏకగ్రీవ ఒప్పందంపై రగడ
►కొండపోచమ్మ సాగర్ పునరావాస కాలనీ మామిడ్యాల్లో బీఆర్‌ఎస్‌ ఏకగ్రీవ ఒప్పందంపై రగడ
►ఏకగ్రీవానికి మాకు ఎలాంటి సంబంధం లేదంటూ నిరసన బాటపట్టిన పలువురు నిర్వాసితులు
►కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారంగా బడిలేదు, గుడిలేదు ఏకగ్రీవం ఎలా చేస్తామని విమర్శ
►కేవలం బీఆర్‌ఎస్ పెద్దల మెప్పు కోసమే ఏకగ్రీవం అంటూ బూటకపు ప్రచారం
►బై బై కేసీఆర్ అంటూ ముంపు బాధితుల నినాదాలు

నిర్మల్‌లో కాంగ్రెస్ విజయభేరీ సభ
►డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని రేవంత్ రెడ్డి ధీమా
►రైతు భరోసా ద్వారా రైతుల ఖాతాలో రూ.15 వేలు ఇవ్వబోతున్నాం
►తెలంగాణ ప్రస్తుతం దొంగల చేతుల్లో ఉందని ఆరోపణ

బీఆర్‌ఎస్, బీజేపీ,ఎంఐఎంలపై ఫిరోజ్ ఖాన్ విమర్శ
►బీఆర్‌ఎస్, బీజేపీ ఎంఐఎంలు సొంత లాభం కోసం ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శ
►తెలంగాణ లో ముగ్గురు కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
►కవిత ఎపిసోడ్ తో ముగ్గురు కాంప్రమైజ్ అయ్యారు
►స్టేట్ లో కేసీఆర్..సెంట్రల్ మోదీని గెలిపించాలని ఒప్పందం
►బీఆర్‌ఎస్కి ఎంఐఎం బి టీం .. బీజేపీకి కూడా ఎంఐఎం బి టీం

కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థి పటేల్ రమేష్ రెడ్డి నామినేషన్ వత్ డ్రా
►సూర్యాపేటలో కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థి పటేల్ రమేష్ రెడ్డి నామినేషన్ వత్ డ్రా
►నల్లగొండ ఎంపీ టికెట్ ఇస్తామని హామీ ఇవ్వడంతో వెనక్కి తగిన రమేష్ రెడ్డి
►ఉదయం రమేష్ రెడ్డి ఇంటికి వచ్చి చర్చలు జరిపిన ఎఐసీసీ నేతలు రోహిత్ చౌదరి
►పార్టీ పెద్దలు హామీ ఇవ్వడంతో నామినేషన్‌ను వెనక్కి తీసుకున్న రమేష్ రెడ్డి
►ఈనెల‌ 17 న రాహుల్, ఖర్గేని కలిపిస్తామని హామీ

కాంగ్రెస్ గడప గడపకు ప్రచారం.. 
►వరంగల్ జిల్లా రాయపర్తి మండలం సన్నూరు గ్రామంలో గడప గడపకు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ  
►ముఖ్యఅతిథిగా హాజరైన కర్ణాటక  రాష్ట్ర హెల్త్ మినిస్టర్ దినేష్ గుండు రావు
►ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మామిండ్ల యశస్విని రెడ్డి, వరంగల్ పార్లమెంట్ ఇన్చార్జి శోభ 

నర్సంపేటలో 17న రాహుల్ రోడ్‌ షో
►వరంగల్‌ జిల్లా నర్సంపేట పట్టణంలో 17వ తేదీన కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి రోడ్డు షో
►హెలిపాడ్ లాండింగ్ స్థలాన్ని పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దొంతి మాధవరెడ్డి, ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్, క్రైమ్ డీసీపీ మురళీధర్, ఏసీపీ తిరుమల్, ఉన్నతధికారులు

తుది ఓటర్ల జాబితా విడుదల
►తుది ఓటర్ల జాబితా విడుదల
►తెలంగాణ తుది ఓటర్ల జాబితా విడుదల చేసిన ఎన్నికల సంఘం
►మొత్తం సాధారణ ఓటర్ల సంఖ్య 3,26,02,799
►పురుష ఓటర్ల సంఖ్య 1,62,98,418
►మహిళా ఓటర్ల సంఖ్య 1,63,01,705
►ట్రాన్స్‌జెండర్‌ ఓటర్లు 2,676
►ఇవిగాక సర్వీస్‌ ఓటర్ల సంఖ్య 15,406 (ఇందులో పురుష ఓటర్లు 14,850.. మహిళా ఓటర్లు 556)
►సర్వీస్‌ ఓటర్లను కలుపుకుని మొత్తంగా ఓటర్ల సంఖ్య 3,26,18,205
►యువ ఓటర్లు (18-19 ఏళ్ల).. 9,99,667
►యువ ఓటర్లలో..  యువతులు 4,29, 273.. యువకులు 5,70, 274.. ట్రాన్స్‌జెండర్‌ ఓటర్లు 120 మొత్తంగా 9,99,667 ఓటర్లు
►వయో వృద్ధ ఓటర్లు (80 ఏళ్లు పైబడిన వాళ్లు).. పురుషులు 1,89,519, మహిళలు 2,50, 840, ట్రాన్స్‌జెండర్‌ ఓటర్లు 12.. మొత్తంగా 4,40,371 ఓటర్లు
►ఓవర్సీస్‌ ఓటర్లు.. పురుషులు 2,380.. మహిళా ఓటర్లు 563, ట్రాన్స్‌జెండర్‌ ఓటర్లు 1 మొత్తంగా 2,944 ఓటర్లు
►పీడబ్ల్యూడీ ఓటర్లు.. పురుషులు 2,90,090, మహిళా ఓటర్లు 2,16,815, ట్రాన్స్‌జెండర్‌ ఓటర్లు 16.. మొత్తంగా 5,06,921 ఓటర్లు
►హైదరాబాద్‌లో అత్యధిక ఓటర్లు 
►మొత్తంగా తెలంగాణలో తుది జాబితా ప్రకారం ఓటర్ల సంఖ్య 3,26,18,205

మాయమాటల కాంగ్రెస్, బీజేపీలను ప్రజలు నమ్మరు: మంత్రి తలసాని
►అమీర్ పేటలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి తలసాని
►మాయమాటల కాంగ్రెస్, బీజేపీలను ప్రజలు నమ్మరని ధ్వజం
►కేసీఆర్ పాలనే తెలంగాణకు శ్రీరామరక్షని వ్యాఖ్య  
►సిక్ వాడలో ఘన స్వాగతం పలికిన సిక్కులు
►భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మంత్రి
►అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో  దేశంలో నెంబర్ వన్ తెలంగాణ
►50 సంవత్సరాలలో జరగని అభివృద్ధిని తొమ్మిదిన్నర సంవత్సరాలలో చేసి చూపెట్టిన బీఆర్‌ఎస్ వెంటే ప్రజలు
►ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటవుతుంది

మహబూబ్ నగర్లో నిరంకుశ పాలన: జితేందర్ రెడ్డి
►మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో నిరంకుశ పాలన కొనసాగుతుందని ఏపీ జితేందర్ రెడ్డి ధ్వజం
►సొమ్మొక్కడిది.. సోకొక్కడిది అన్న విధంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యవహారం ఉంటుందని విమర్శ
►హిందువులకు అండగా ఉంటానని చెప్పి ద్రోహం చేశాడని కాంగ్రెస్ అభ్యర్థి యెన్నం శ్రీనివాసరెడ్డిపై విమర్శ
►కేంద్రం నిధులతోనే జిల్లాలో అభివృద్ధి జరిగిందని స్పష్టం
►ప్రధాని నరేంద్ర మోదీ బీసీలకు పెద్ద పీట వేశాడని వ్యాఖ్య
►బీజేపీకి చేయూతనివ్వాలని ప్రజలకు విన్నపం 

గుజరాత్‌లో లేని 24 గంటల కరెంట్ తెలంగాణలో సాధ్యమైంది:కేటీఆర్‌
►జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం దుంపేట ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న మంత్రి కేటీఆర్
►గుజరాత్‌లో 24 గంటల కరెంట్ లేదు.. కానీ తెలంగాణలో 24 గంటల విద్యుత్ ఇస్తున్నామని వ్యాఖ్య
►కాంగ్రెస్ వాళ్లు పదకొండు సార్లు గెలిచి ఏం‌ చేశారని ప్రశ్న
►ఈ ఎలక్షన్ ఒక్క ఎమ్మెల్యే ఎలక్షన్ కాదు తెలంగాణ తలరాత రాసే ఎలక్షన్‌గా పేర్కొన్న కేటీఆర్‌
►తెల్ల కార్డు ఉంటే కౌల్ రైతుకు కేసీఆర్ భీమా, రైతులకు  ధీమా  స్కీం పెడుతున్నామని ప్రకటన
►పద్దెనిమిది ఏళ్లు నిండిన అమ్మాయిలకు సౌభాగ్యలక్ష్మి తీసుకొస్తున్నాం, ప్రతి నెల 3 వేలు ఇస్తామని కేటీఆర్ హామీ
►ఒక్క కేసీఆర్ ను కొట్టడానికి ఎందరో వస్తున్నారు. మా అందరికి ధైర్యం మీరు, తెలంగాణ పార్టీని మీరు కాపాడాలని వ్యాఖ్య
►తెలంగాణానను మళ్లీ ఢిల్లీ వాళ్ల చేతిలో పెడుదామా?
►బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక సంవత్సరంలో కలిగోట సూరమ్మ ప్రాజెక్టు పూర్తి చేస్తాం
►డిసెంబర్ తర్వాత గెలిచాకా వేములవాడ నియోజకవర్గంను దత్తత తీసుకుంటామని ప్రకటన
►ఉమక్క మన ఆడబిడ్డ ,అలాంటి ఉమక్కకు బీజేపి పార్టీ అన్యాయం చేసింది.
►ఉమక్కకు గతంలో ఉన్న పదవికంటే మంచి పదవి ఇస్తామని ప్రకటన

చల్లబడ్డ పటేల్‌ రమేష్‌రెడ్డి
►సూర్యాపేట కాంగ్రెస్‌ రెబల్‌ పటేల్‌ రమేష్‌రెడ్డితో అధిష్టానం చర్చలు
►ఎంపీ సీటు హామీ ఇవ్వడంతో నామినేషన్‌ ఉపసంహరణకు సిద్ధపడ్డ రమేష్‌రెడ్డి
►కాంగ్రెస్‌ గెలుపు కోసం పని చేస్తానని ప్రకటించిన రమేష్‌రెడ్డి
►మల్లు రవిపై పటేల్‌ అనుచరుల వీరంగం.. దాడికి యత్నం
►రంగంలోకి దిగిన కేంద్ర బలగాలు
►అధిష్టాన సూచనతో రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి పటేల్‌ రమేష్‌రెడ్డి

గజ్వేల్‌లో భారీగా నామినేషన్స్‌ విత్‌డ్రా
►కేసీఆర్‌ పోటీ చేస్తున్న రికార్డు స్థాయిలో నామినేషన్లు దాఖలు
►పరిశీలన తర్వాత కూడా 114 మంది బరిలో
►నిన్నటి వరకు 28 మంది విత్‌డ్రా.. మిగిలిన 86 మంది అభ్యర్థులు
►ఇవాళ మరికొన్ని విత్‌డ్రా.. ప్రస్తుతం 57 మందే
►మరికాసేపట్లో ముగియనున్న నామినేషన్ల ఉపసంహరణ గడువు

ఇసుక మీద ఎవరైనా బ్యారేజ్‌ కడతారా?: రేవంత్‌రెడ్డి
►బోథ్‌లో కాంగ్రెస్‌ విజయభేరి సభ.. రేవంత్‌ రెడ్డి ప్రసంగం 
►ఇసుక మీద ఎవరైనా బ్యారేజ్‌ కడతారా?
►కేసీఆర్‌ అవినీతికి మేడిగడ్డ బలైంది
►కేసీఆర్‌ ఎత్తిపోతల పథకం అంటే ఏంటో తెలుసు కదా
►ప్రజలు చనిపోతారంటే రారుకానీ.. పొన్నాల పార్టీలోకి వస్తానంటే మాత్రం వెళ్తారు
►బలరాంనాయక్‌ తన టికెట్‌ను త్యాగం చేశారు
►బోథ్‌ టికెట్‌రాని వన్నెల అశోక్‌ తన నామినేషణ​ విత్‌డ్రా చేసుకోవాలి
►బోథ్‌కు నీళ్లు రాకపోవడానికి కేసీఆరే కారణం
►కాంగ్రెస్‌ గెలిస్తే బోథ్‌కు రెవెన్యూ డివిజన్‌ వస్తుంది
►బోథ్‌కు కుంత్రీ ప్రాజెక్టు, డిగ్రీ కాలేజీ ఇచ్చే బాధ్యత నాది
►బీఆర్‌ఎస్‌, బీజేపీ, ఎంఐఎం.. అంతా ఒక్కటే

పటేష్‌ రమేష్‌ రెడ్డి అంశంలో కీలక పరిణామం

►సూర్యాపేట రెబల్‌ అభ్యర్థి పటేల్‌ రమేష్‌ రెడ్డి అంశంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. 
►రమేష్‌ రెడ్డితో ఏఐసీసీ దూతలు చర్చలు జరుపుతున్నారు.
►ఈ సందర్భంగా కేసీవేణుగోపాల్‌తో మాట్లాడిన నేతలు
►రమేష్‌కు అండగా ఉంటామని వేణుగోపాల్‌ హామీ. 
►రాహుల్‌ హామీ ఇస్తే ఆలోచిస్తానని తెలిపిన రమేష్‌. 

హుజూరాబాద్‌లో ఈటల సీరియస్‌ కామెంట్స్‌
►హుజూరాబాద్‌లోని వీణవంక మండలంలో ఈటల రాజేందర్‌ ఎన్నికల ప్రచారం
►ఉప ఎన్నికలతో నేను చాలా నష్టపోయాను. 
►నా దగ్గరున్న డబ్బులన్నీ ఉప ఎన్నికల్లో​ ఖర్చు అయ్యాయి. 
►నేను ఈసారి డబ్బులు ఖర్చుపెట్టే స్థితిలో లేను. 
►ధైర్యలక్ష్మి మాత్రమే నా దగ్గర ఉంది. 
►బెల్ట్ షాపులు బంద్ చేస్తే జీతాలు ఇవ్వలేని దుస్థితికి రాష్ట్రాన్ని తీసుకువచ్చారు. 
►కేంద్రం నిధులు ఇవ్వకపోతే గ్రామపంచాయితీ సఫాయి కార్మికులకు కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు.

కేసీఆర్‌ దోపిడీకి వ్యతిరేకంగా ఐదేళ్లు పోరాడాను: భట్టి కీలక వ్యాఖ్యలు
►సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఖమ్మంలో ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొన్నారు. 
►ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ..
►పదేళ్లు కేసీఆర్‌కు అధికారం ఇస్తే ఏం చేసిండు? ప్రజా సంపదను దోచుకోవడం తప్ప‌?
►ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ప్రగతిభవన్ వీడడు, సెక్రటేరియట్‌కి రాడు.. ఇలాంటి  సీఎం మనకు అవసరమా?
►సీఎం కేసీఆర్ మాదిరిగా ఫామ్ హౌస్‌లో పడుకోలేదు. 
►ఇన్నిరోజులు ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల్లో తిరిగాను..
►ఈ ప్రభుత్వం చేస్తున్న దోపిడీకి వ్యతిరేకంగా ఐదేళ్లుగా ప్రభుత్వంపై పోరాడాను.
►కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలు పదేళ్లు అధికారంలో ఉన్న మీకు అమలు చేయాలన్న సోయి ఎందుకు రాలేదు.
►పదేళ్లు రేషన్ కార్డు ఇవ్వలేని బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చేసిందని చెప్పుకోవడానికి బుద్ధుండాలి కదా!
►కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 9 నిత్యావసర సరుకులు రేషన్ దుకాణాల ద్వారా పేదలకు ఇచ్చేవాళ్లం. 
►పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం బియ్యం తప్ప ఇంకేమైనా ఇస్తున్నదా?
►ధనిక రాష్ట్రం నిధులు ఏమయ్యాయి? ఎక్కడికి పోయాయి?
►జడ్పీ ఛైర్మన్‌గా ఉండి కమల్ రాజు ఐదు సంవత్సరాలుగా మధిరకు చేసిన అభివృద్ధి ఏంటి?
►ప్రజలకు కావలసిన ఇండ్లు, ఇంటి స్థలాలు, రేషన్ కార్డు ఇవ్వలేని వారు ఇంటి ముందు వచ్చి కూర్చుంటే ఏంటి? కూర్చోకుంటే ఏంటి? వీళ్ళతో కలిగే ప్రయోజనం ఏమిటి?
►కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మధిరకు నిధుల వరద పారించాను. 
►ఎర్రుపాలెం మండలంలోని జాలుమూడి, కట్టలేరు ప్రాజెక్టుల కట్టలు కట్టించాను.
►బడులు, ఇండ్లు, ఇంటి స్థలాలు, రోడ్లు, మురికి కాలువలు, లైట్లు, ప్రభుత్వ భవన నిర్మాణాలు చేయించాను.
►అధికారంలో 5 ఏండ్లు ఉండి మధిర అభివృద్ధికి నిధులు తీసుకురాని వారు ఇప్పుడు గెలిచి ఏం తీసుకొస్తారు? 
►బీఆర్ఎస్ పాలకుల మాయమాటలకు ఇక చెల్లు.. ప్రజల తిరుగుబాటు మొదలైంది.
►తెలంగాణ ప్రజలు చూపు ఇక కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. 
►నవంబర్ 30న కాంగ్రెస్ అభ్యర్థుల చెయ్యి గుర్తుపై ఓట్లు వేసి గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.

11:45 AM, Nov 15, 2023
కామారెడ్డిలో రేవంత్‌ కామెంట్స్‌..
►పది సంవత్సరాలుగా రాష్టాన్ని పట్టిపీడిస్తున్న చీడపురుగు కేసీఆర్‌ను తొలగించే సమయం వచ్చింది. 
►ధర్మానికి అధర్మానికి జరుగుతున్న ఎన్నిక ఇది.  
►ఆరు నెలలుగా 24 గంటల పాటు రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు నిరూపిస్తే ఈరోజు మూడు గంటలలోపు నామినేషన్ ఉపసంహరించుకుంటా.  
►నిరూపించే దమ్ము నీకు ఉందా కేసీఆర్‌. 
►ఫామ్‌హౌస్‌లో ఉండే నీకెందుకు అధికారం.
►రైతుల రుణమాఫీ, నిరుద్యోగులు, మిషన్ కాకతీయల గురించి కేసీఆర్ ఒక్కసారి కూడా మాట్లాడడు. 
►కేసీఆర్ పాపాల భైరవుడు. 
►బీఆర్ఎస్ కోసం బీజేపీ, ఎంఐఎం పనిచేస్తోంది.  
►2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ఏం చేసిందో చెబుతాం. 
►మరి 2014 నుంచి 2023 వరకు నువ్వేం ఏం చేసినవో చెప్పేందుకు సిద్ధమా?. 

11:30 AM, Nov 15, 2023
పచ్చని భూములపై కేసీఆర్ కన్ను పడింది: షబ్బీర్‌ అలీ
►కామారెడ్డిలో కాంగ్రెస్‌ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం. 
►కార్యక్రమానికి హాజరైన రేవంత్‌ రెడ్డి, షబ్బీర్‌ అలీ, కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు. 
►కామారెడ్డి, నిజామాబాద్, ఇతర ఉమ్మడి జిల్లా నియోజక వర్గాల్లో పరిస్థితులపై చర్చ
►షబ్బీర్ అలీ కామెంట్స్..
►కామారెడ్డిలోని పచ్చని భూములపై కేసీఆర్ కన్ను పడింది. 
►కామారెడ్డిలో కేసీఆర్‌పై పోటీ చేయాలని అధిష్టానం  రేవంత్ రెడ్డికి సూచించింది.
►ఇక్కడ రేవంత్ పోటీ చేయడం కామారెడ్డి ప్రజల అదృష్టం. 
►కామారెడ్డిలో దొరల రాజ్యానికి ప్రజల రాజ్యానికి మధ్య పోటీ జరుగుతోంది. 
►ప్రతీ కార్యకర్త నేనే రాహుల్ గాంధీ, నేనే సోనియా గాంధీ, నేనే రేవంత్ రెడ్డి, నేనే షబ్బీర్‌ అలీ అని భావించుకొని పనిచేయాలి.

11:00 AM, Nov 15, 2023
కాంగ్రెస్‌లో రె‘బెల్స్‌’ డేంజర్‌ బెల్స్‌
►కాంగ్రెస్‌ నేత పటేల్ రమేష్ రెడ్డితో హస్తం నేతల చర్చలు
►సూర్యాపేటకు వెళ్లిన ఏఐసీసీ కార్యదర్శి రోహిత్  చౌదరీ, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి
►సూర్యాపేటలో కాంగ్రెస్ రెబల్‌గా నామినేషన్ వేసిన పటేల్ రమేష్ రెడ్డితో కాంగ్రెస్ నేతల చర్చలు.
►నామినేషన్ విత్ డ్రా చేసుకోవాలని కోరుతున్న టీ కాంగ్రెస్ నేతలు.

►ఏఐసీసీ పెద్దలను చూడగానే కన్నీటి పర్యంతమైన రమేష్‌ రెడ్డి, కుటుంబ సభ్యులు.
►రెండోసారి కూడా తనకు టికెట్‌ ఇవ్వకుండా మోసం చేశారని ఆవేదన. 
►కాంగ్రెస్‌ పెద్దల బుజ్జగింపులను రమేష్‌ రెడ్డి పట్టించుకోలేదు, వెనక్కి తగ్గలేదు. 
►పటేల్‌ మద్దతుదారులు రోహిత్‌ చౌదరీ, మల్లు రవిని అడ్డుకున్నారు. 
►కాంగ్రెస్‌ నేతలకు వ్యతిరేకంగా రోడ్డుపై బెఠాయించి నిరసనలు తెలిపారు. 

తెలంగాణలో ఒక్కో నియోజకవర్గం నుంచి ముగ్గురు, నలుగురు నేతలు టికెట్లు ఆశించగా, అందులో టికెట్లు రాని అసంతృప్తులు రాష్ట్రవ్యాప్తంగా 24 చోట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఈ 24 మందిని కాంగ్రెస్‌ పెద్దలు బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కనీసం 10 చోట్ల ఆ పార్టీకి రె‘బెల్స్‌’మోగక తప్పదని గాంధీ భవన్‌ వర్గాలే అంటున్నాయి. ముఖ్యంగా సూర్యాపేట, బాన్సువాడ, వరంగల్‌ వెస్ట్, డోర్నకల్, వైరా, ఇల్లందు నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది. 

రెబల్‌ అభ్యర్థులు వీరే..
ఈసారి కాంగ్రెస్‌ రెబెల్స్‌గా జంగా రాఘవరెడ్డి (వరంగల్‌ వెస్ట్‌), నరేశ్‌ జాదవ్‌ (బోథ్‌), గాలి అనిల్‌కుమార్‌ (నర్సాపూర్‌), ఎస్‌.గంగారాం (జుక్కల్‌), కాసుల బాలరాజు (బాన్సువాడ), నాగి శేఖర్‌ (చొప్పదండి), దైద రవీందర్‌ (నకిరేకల్‌), రామ్మూర్తి నాయక్‌ (వైరా), ప్రవీణ్‌ నాయక్, చీమల వెంకటేశ్వర్లు (ఇల్లందు), విజయ్‌కుమార్‌రెడ్డి (ముథోల్‌), లక్ష్మీనారాయణ నాయక్‌ (పాలకుర్తి), సున్నం వసంత (చేవెళ్ల), నెహ్రూ నాయక్‌ (డోర్నకల్‌), భూక్యా మంగీలాల్‌ (మహబూబాబాద్‌), పటేల్‌ రమేశ్‌రెడ్డి (సూర్యాపేట), చిమ్మని దేవరాజు (పరకాల), సిరిసిల్ల రాజయ్య (వర్ధన్నపేట)తోపాటు మరికొంత మంది రంగంలోకి దిగారు.

వీరిలో ఒకరిద్దరు ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ (ఏఐఎఫ్‌బీ) టికెట్లు తెచ్చుకుని సింహం గుర్తుపై పోటీ చేశారు. రెబెల్స్‌గా నామినేషన్లు దాఖలు చేసిన వారితో మంతనాలు జరిపి వారి నామినేషన్లను ఉపసంహరింపజేసే బాధ్యతలను రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బి.మహేశ్‌కుమార్‌గౌడ్‌లకు పార్టీ అప్పగించింది. దీంతో వీరందరినీ హైదరాబాద్‌కు రావాలని ఆహ్వానించారు.

9:30 AM, Nov 15, 2023
కాంగ్రెస్‌కు కవిత కౌంటర్‌..
►కాంగ్రెస్‌ నేతలకు ఎమ్మెల్సీ కవిత కౌంటర్‌
►కర్ణాటక మోడల్‌పై షాకింగ్‌ కామెంట్స్‌
►సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో 24 గంటల కరెంట్‌
►కర్ణాటకలో కాంగ్రెస్‌ కరెంట్‌ కోసం నిస్సహాయత
►తెలంగాణలో మరోసారి కేసీఆర్‌దే విజయం

8:30 AM, Nov 15, 2023
హరీష్‌, రేవంత్‌, అక్బరుద్దీన్‌ వద్ద ఉన్న ఆయుధాలు ఇవే.. 
►ఎన్నికల నేపథ్యంలో ఆయుధాల వివరాలను వెల్లడించిన పొలిటికల్‌ నేతలు
►మంత్రి హరీష్‌ రావు వద్ద 1.3 లక్షల విలువ చేసే పిస్టల్‌(గన్‌) ఉన్నట్టు తెలిపారు. 
►టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ వద్ద 2లక్షలు విలువ చేసే పిస్టల్‌, 50వేలు విలువైన రైఫిల్‌ ఉంది. 
►ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ వద్ద కుటుంబ వారసత్వ పిస్టల్‌తో సహా మూడు ఆయుధాలను కలిగి ఉన్నట్టు తెలిపారు. 

7:45 AM, Nov 15, 2023
ముగిసిన ఐటీ సోదాలు.. భారీగా నగదు స్వాధీనం..
►హైదరాబాద్‌లో ఐటీ సోదాలు ముగిశాయి. 
►కోట్ల నరేందర్ రెడ్డి ఇంట్లో 7 కోట్ల 50 లక్షలు స్వాధీనం
►ప్రదీప్ రెడ్డి ఇంట్లో భారీగా డబ్బు స్వాధీనం
►మహేశ్వరం ఎన్నికల కోసం సమకూర్చుకున్న డబ్బుగా తేల్చిన ఐటీ అధికారులు. 

7:05 AM, Nov 15, 2023
నేడు కరీంనగర్‌లో ఈటల ప్రచారం
►నేడు హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్ ప్రచారం
►వీణవంక మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం చేయనున్న ఈటల

7:00 AM, Nov 15, 2023
నేడు సిరిసిల్ల పర్యటనకు కేటీఆర్‌
►మంత్రి కేటీఆర్‌ నేడు సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. 
►వేములవాడ నియోజకవర్గంలో రోడ్‌షోలో పాల్గొననున్నారు.
►కమలాపూర్, మేడిపల్లి మండలాల్లో ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్న కేటీఆర్
►ఆ తర్వాత రుద్రంగి, చందుర్తి, కోనరావుపేట, వేములవాడలో రోడ్ షో, ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొనున్న కేటీఆర్
►సాయంత్రం సిరిసిల్ల నియోజకవర్గంలో టూర్

7:00 AM, Nov 15, 2023
నేడు ఆదిలాబాద్‌లో రేవంత్‌ పర్యటన
►ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్  రెడ్డి పర్యటన
►బోథ్, నిర్మల్ కాంగ్రెస్ సభలలో పాల్గొననున్న రేవంత్
►ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్న రేవంత్

6:50 AM, Nov 15, 2023
నేటి నుంచి ఓటర్‌ స్లిప్స్‌ పంపిణీ మొదలు..
►తెలంగాణవ్యాప్తంగా నేటి నుంచి ఓటర్ స్లీప్స్‌ పంపిణీ మొదలు
►తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో పంపిణి చేయనున్న ఎలక్షన్ కమిషన్
►BLO ఆధ్వర్యంలో ఓటర్ స్లిప్స్‌ పంపిణీ
►ఓటుకు సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే 1950 నంబర్‌కు కాల్ చేయాలని ఈసీ విజ్ఞప్తి.

6:45 AM, Nov 15, 2023

నేడు నిజామాబాద్ జిల్లాలో కేసీఆర్‌ పర్యటన
►సీఎం కేసీఆర్‌ నేడు ఉమ్మడి నిజామాబాద్‌లో పర్యటించనున్నారు. 
►నిజామాబాద్ అర్బన్, బోధన్, ఎల్లారెడ్డి మూడు సభల్లో పాల్గొననున్న కేసీఆర్ 
►నిజామాబాద్ బోధన్‌లలో అభ్యర్థులతో కలిసి ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్సీ కవిత
►భారీ జనసమీకరణ చేస్తున్న పార్టీ నేతలు.

6:40 AM, Nov 15, 2023
నామినేషన్ల ఉపసంహరణకు నేడే లాస్ట్‌
►అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణకు నేటితో ముగియనున్న గడువు
►నామినేషన్ల పరిశీలన తరువాత ఆమోదించిన అభ్యర్థులు 2,898 మంది
►గజ్వేల్‌ బరిలో అత్యధికంగా 114 మంది అభ్యర్థులు.
►మేడ్చల్‌లో 67 మంది అభ్యర్థుల నామినేషన్లకు ఆమోదం.
►కామారెడ్డిలో 56 మంది అభ్యర్థుల నామినేషన్లు
►ఎల్బీనగర్‌లో 57 మంది అభ్యర్థుల నామినేషన్లకు ఆమోదం.
►గజ్వేల్‌లో సీఎం కేసీఆర్‌పై పోటీకి ధరణి, మల్లన్న సాగర్ బాధితులు, నిరుద్యోగుల నామినేషన్ల దాఖలు
►మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు సమయం.
►భారీగా నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉందంటున్న పార్టీలు.
►రెబల్స్‌ను, ఇండిపెండెంట్ అభ్యర్థులను బుజ్జగిస్తున్న పార్టీలు.

మాట్లాడాలా.. పోవాలా.. సీఎం కేసీఆర్‌ ఫైర్‌
►పాలకుర్తి సభలో సీఎం కేసీఆర్‌ ఆగ్రహం
►ఓ కార్యకర్త ఓవరాక్షన్‌తో కేసీఆర్‌ సీరియస్‌
►సభలో మాట్లాడాలా.. వెళ్లిపోవాలంటూ ఆగ్రహం

నా భార్యను చంపుతానని బెదిరిస్తున్నారు: బండి సంజయ్‌
►కరీంనగర్‌ ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్‌ సంచలన కామెంట్స్‌
►పాతబస్తీలో మీటింగ్‌ పెడితే నా కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించారు. 
►నా భార్యను చంపేస్తామని బెదిరిస్తున్నారు. 
►చావుకు నేను భయపడను.. చావే నన్న చూసి భయపడుతుంది. 

తెలంగాణలో ఎన్నికల సిత్రాలు..
►ప్రచారంలో ఆడి పాడిన నేతలు
►ఓట్ల కోసం ఎన్ని తిప్పలు..

నల్లగొండలో ఉద్రిక్తత..
►నెల్లికలు లిఫ్ట్‌ వద్ద ఉద్రిక్తత.
►లిఫ్ట్‌కు శంకుస్థాపన చేసిన ప్రాంతంలో బీజేపీ ధర్నా. 
►అడ్డుకున్న బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, ఇరు వర్గాల మధ్య వాగ్వాదం. 
►సాగర్‌ అభ్యర్థి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌ రెడ్డిపై దాడి. 

మరిన్ని వార్తలు