శాశ్వత పరిష్కారం చూపుతాం

11 Feb, 2018 12:09 IST|Sakshi

 సాగునీరు కలుషితం కాకుండా చూస్తాం

కె.కె.కొట్టాల, కనంపల్లె గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా

ఆందోళన చెందవద్దని ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి భరోసా  

వేముల :  టెయిలింగ్‌ పాండ్‌ వ్యర్థ పదార్థాలు సాగు, తాగునీటిలో కలుషితం కాకుండా శాశ్వత పరిష్కారం చూపుతామని.. ఈ విషయంపై  సీఎండీ హస్నానితో చర్చిం చానని.. అప్పటి వరకు  కె.కె.కొట్టాల, కనంపల్లెకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తారని కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి గ్రామస్తులకు భరో సా ఇచ్చారు.  కె.కె.కొట్టాల, కనంపల్లెలో యురేనియం ప్రాజెక్టు ఈడీ ఏఆర్‌ ఘడే,  అధికారులతో కలిసి కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి శనివారం పర్యటించారు. ఎంపీ మాట్లాడుతూ టెయిలింగ్‌ పాండ్‌ వ్యర్థాలతో   సాగు, తాగునీరు కలుషి తమై పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారని కలెక్టర్‌కు వివరించామన్నా రు. 

స్పందించిన ఆయన జమ్మలమడుగు ఆర్డీఓ నాగన్న అధ్యక్షతన అధికారులతో కమిటీ వేశారని..  వారు నివేదిక ఇచ్చిన వెం టనే   కలెక్టర్‌  దెబ్బతిన్న పంటలను పరిశీ లిస్తారన్నారు.  శాశ్వత పరిష్కారం వచ్చేవరకు పోరాడుతామని.. ఎవరూ ఆందోళన చెందవద్దని  గ్రామస్తులకు భరోసా ఇచ్చారు. కలుషిత నీరు తాగి చిన్నారులలో దద్దర్లు, దురద వచ్చాయని గ్రామస్తులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఆయన స్పందిస్తూ ట్యాంకర్ల ద్వారా  శుద్ధి చేసిన తాగునీటిని సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.

టెయిలింగ్‌ పాండ్‌వల్ల   తీవ్ర ప్రభావం.. : యురేనియం వ్యర్థాలను వేస్తున్న టెయిలింగ్‌ పాండ్‌వల్ల ప్రభావం తీవ్రంగా ఉంటుం దని ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి యురేనియం అధికారులకు సూచించారు.    భూమయ్యగారి పల్లె, రాచకుంటపల్లె, తుమ్మలపల్లె, మబ్బుచింతలపల్లె గ్రామాలలో కూడా దీని ప్రభావం ఉందన్నారు. దీనికి శాశ్వత పరిష్కారం చూపాలన్నారు.

యూసీఐఎల్‌ సీఎండీ రాక ..
ఈనెల 15, 16వ తేదీలలో యూసీఐఎల్‌ సీఎండీ హస్నాని కె.కె.కొట్టాల, కనంపల్లె గ్రామాలలో పర్యటిస్తారని   వైఎస్‌ అవినాష్‌ రెడ్డి గ్రామస్తులకు చెప్పారు. ఇప్పటికే ఈ గ్రామాల్లో కలుషిత సాగునీటితో పంటలు దెబ్బతిని రైతులు నష్టపోయిన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లానన్నారు.  జెడ్పీటీసీ సభ్యుడు మరకా శివకృష్ణారెడ్డి, వైఎస్సార్‌సీపీ మండల పరిశీలకులు లింగాల రామలింగారెడ్డి, ప్రాజెక్టు జీఎంలు ప్రాణేష్‌. ఎంఎస్‌ రావు, ఆర్‌డబ్లు్యఎస్‌ డీఈ పురుషోత్తం, ఎంపీడీఓ శివరామప్రసాద్‌రెడ్డి, ఆర్‌డబ్లు్యఎస్‌ ఏఈ శివారెడ్డి, కె.కె.కొట్టాల గ్రామ సర్పంచ్‌ శ్రీనివాసులు, కనంపల్లె సర్పంచ్‌ దేవదాసు  పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు