బీసీలకు 65 స్థానాలు కేటాయిస్తాం: శివసేన

30 Sep, 2018 02:12 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు 65 స్థానాలు కేటాయిస్తామని తెలం గాణ శివసేన పార్టీ ప్రకటించింది. ఈ మేరకు శివసేన రాష్ట్రశాఖ ప్రధాన కార్యదర్శి సుదర్శన్, కార్యదర్శి దొరిషి వీరేంద్ర శేఖర్, గౌటే గణేశ్‌ శనివారం బీసీ భవన్‌లో ఆర్‌.కృష్ణయ్యను కలిసి చర్చలు జరిపారు. అనంతరం సుదర్శన్‌ మాట్లాడుతూ.. చట్ట సభల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించాలనే కృష్ణయ్య పోరాటానికి శివసేన మద్దతు ఉంటుందని తెలిపారు.

తమ పార్టీ జరిపిన సర్వేలో బీసీలకు రాజ్యాధికారం కావాలని ప్రజలు కోరుతున్నట్లు తేలిందని, అందుకే కృష్ణయ్య సీఎం అభ్యర్థిత్వానికి మద్ద తు ప్రకటిస్తున్నామన్నారు. జనాభా దామాషా ప్రకారం బీసీలకు రావాల్సిన న్యాయమైన వాటా అందడం లేదని, బీసీలకు రాజ్యాధికారం దక్కకుండా రాజకీయ పార్టీలు అన్యాయం చేస్తున్నాయన్నారు. స్వాతంత్య్రం వచ్చి 72 ఏళ్లు అయినా బీసీలకు సీఎం పదవి దక్కక పోవడం, అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు టికెట్లు కేటాయిస్తు న్న తీరే ఇందుకు నిదర్శనమన్నారు. త్వరలో ఉద్ధవ్‌ థాక్రేతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు