‘మోసాలకు, కుట్రలకు బాబు పెట్టింది పేరు’

13 Jun, 2018 13:56 IST|Sakshi
వైఎస్సార్‌ సీపీ నేత ఆదిశేషగిరి రావు (ఫైల్‌ ఫొటో)

సాక్షి, గుంటూరు : కుట్రలు, మోసాలకు చంద్రబాబు నాయుడు పెట్టింది పేరని వైఎస్సార్‌ సీపీ నేత ఘట్టమనేని ఆదిశేషగిరి రావు విమర్శించారు. నవ నిర్మాణ దీక్షల పేరిట చంద్రబాబు మళ్లీ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. తన అసరమర్థతను కప్పిపుచ్చుకునేందుకే కేంద్రంతో పాటు ప్రతిపక్షంపై చంద్రబాబు విమర్శలు చేస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌ సీపీ చేస్తోన్న పోరాటం చూసి చంద్రబాబులో అభద్రతా భావం నెలకొందన్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా పోలవరం ప్రాజెక్టు సాధించిన ఘనత మహానేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డికే దక్కుతుందని ఆదిశేషగిరి రావు వ్యాఖ్యానించారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు