సీఎం జగన్‌ అప్పుడే చెప్పారు: ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి

14 Feb, 2020 11:09 IST|Sakshi

సాక్షి, తూర్పు గోదావరి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇప్పటికైన బుద్ది తెచ్చుకుని తాను సంపాదించిన అవినీతి సొమ్మును ప్రకటిస్తే బాగుంటుందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు పెద్ద ఎత్తున అవినీతి చేస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గతంలో చెప్పారని.. నేడు ఆ అవినీతి బయటపడిందన్నారు. చంద్రబాబు దగ్గర పనిచేసిన వ్యక్తి వద్ద రూ. 2వేల కోట్లు బయటపడ్డాయంటే.. ఇక బాబును విచారిస్తే రూ. 2 లక్షల కోట్లకుపైగా అవినీతి సొమ్ము బయట పడుతుందని పేర్కొన్నారు. ఆయన పీఏ దగ్గర బయటపడిన సొమ్ము చంద్రబాబుదే తక్షణమే ఆయనను అరెస్టు చేసి తీహరు జైలుకు తరలించి అవినీతి ఆరోపణలపై విచారణ చేయాలని అన్నారు.

మనీ లాండరింగ్‌లో బాబు దిట్ట: మంత్రి అవంతి

కాగా.. ఐటీ దాడుల్లో పట్టుబడిన సొమ్మురాష్ట్రానిదే కాబట్టి.. ఆ సొమ్ము అధికార వికేంద్రీకరణకు ఖర్చు పెడితే మన రాజధానులు అభివృద్ధి చెందుతాయని తెలిపారు. చంద్రబాబును నాయకుడు అనడానికే సిగ్గేస్తుందని, అలాంటి వ్యక్తి మన రాష్ట్రంలో పుట్టడం ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం.. దురదృష్టమని విమర్శించారు. గతంలో కులాలను, రాష్ట్రాన్ని విడగొట్టారు.. ఇప్పుడు ప్రాంతాలను విడగొడుతున్నాడని మండిపడ్డారు. ఇక బాబు తల్లే బ్రతికి ఉంటే.. ఇలాంటి కొడుకును ఎందుకు కన్నాన అని బాధపడే పరిస్థతి వచ్చేదని అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా చంద్రబాబు ప్రజల కోసం ముందుకు వచ్చి.. తాను తప్పు చేశానని ఒప్పుకుని అవినీతి భాగోతం చెబితే రాబోయే తరాలకు మంచి జరుగుతుందని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు