జగన్‌ అనే నేను; అప్నా టైమ్‌ ఆయేగా...

22 Mar, 2019 20:28 IST|Sakshi

అధికారం కోసం పరితపించే వాడు రాజకీయ నాయకుడు మాత్రమే అనిపించుకుంటాడు.. అదే ఆశయసాధన కోసం కష్టాల్ని సైతం లెక్కచేయని మనస్తతత్వం ఉన్నవాడు ప్రజానాయకుడిగా ఎదుగుతాడు.. ప్రజల గుండెల్లో శాశ్వతంగా కొలువు ఉంటాడు. ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఇందుకు నిలువెత్తు నిదర్శనం. అందుకే ప్రజా సంక్షేమానికి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన రాజన్న ‘ఆశయ’ వారసత్వాన్ని కొనసాగించేందుకు అనేక కష్టనష్టాలకోర్చి 3,648 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగించి ప్రజా సమస్యల గురించి స్వయంగా తెలుసుకున్నారు. ఆ క్రమంలో హత్యాయత్నం వంటి ఘటనలు చోటుచేసుకున్నా మడమ తిప్పక ప్రజాక్షేత్రంలోనే గడిపారు.


ప్రస్తుతం ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ప్రత్యర్థులు తన చిన్నాన్నను హత్య చేసి కుట్ర రాజకీయాలకు తెరతీసినా బాధను దిగమింగి.. సంయమనం పాటిస్తూ ఎన్నికల ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ‘జగన్‌ అనే నేను’ అంటూ ఆయన పలికే మాటల కోసం వైఎస్‌ జగన్‌ అభిమానులే కాదు సామాన్య ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఈ నేపథ్యంలో రాజన్న పాదయాత్ర ఘట్టాన్ని ‘ యాత్ర’గా తెరకెక్కించిన సినిమా దర్శకుడు  మహి వి రాఘవ్‌ ప్రస్తుతం ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసిన వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. వైఎస్‌ జగన్‌ అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగిస్తున్న దృశ్యాలకు.. ‘జైబోలో ఆజాదీ’ అంటూ ఫుల్‌జోష్‌గా సాగే బీజీని జతచేశారు. ‘అప్నా టైమ్‌ ఆయేగా’ అనే క్యాప్షన్‌తో పోస్ట్‌ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.

మరిన్ని వార్తలు