‘కోడి గుడ్డు మీద ఈకలు పీకే మీ బుద్ధి మారదా?’

20 Apr, 2019 18:31 IST|Sakshi

కోడి గుడ్డు మీద ఈకలు పేకే మీ బుద్ధి మారదా? అని నారా లోకేష్‌ ఎన్నికల సంఘాన్ని ప్రశ్నిస్తే, అదే ప్రశ్నను తిరిగి లోకేష్‌కు నెటిజన్లు సంధిస్తున్నారు. తెలంగాణలో ఎన్నికల కోడ్ వర్తించదా? ఏంటీ పక్షపాతం? ఎన్నికల కోడ్ ఒక్క ఏపీలోనే ఉందా? ఈసీ ఆంక్షలన్నీ ఒక్క టీడీపీకే వర్తిస్తాయా? అంటూ నారా లోకేష్‌ ట్విట్టర్‌లో ఎన్నికల సంఘంపై ధ్వజమెత్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ జరిపే సమీక్షల్లో ప్రధాన కార్యదర్శితో సహా డీజీపీ కూడా పాల్గొంటున్నారు. కేసీఆర్ సమీక్షలపై సమాచార పౌర సంబంధాల శాఖ అధికారికంగా పత్రికా ప్రకటనలు కూడా చేస్తోంది అని పేర్కొన్నారు.

ఎండలు, తాగునీటి సమస్యలపై కూడా ముఖ్యమంత్రి సమీక్షలు జరిపి చర్యలు తీసుకోకపొతే ప్రజల పరిస్థితి ఏమిటి? ఆలోచించరా? కోడి గుడ్డు మీద ఈకలు పీకే మీ బుద్ధి మారదా? అంటూ ట్విట్టర్‌లో ఎన్నికల సంఘంపై లోకేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే లోకేష్‌ ట్వీట్‌కు నెటిజన్లు అదే రీతిలో బదులిస్తున్నారు. ముందు ముఖ్యమంత్రికి, ఆపద్ధర్మ ముఖ్యమంత్రికి తేడా తెలుసుకో లోకేషం, పుట్టినరోజు నాడు కూడా మీ నాన్నని నిమ్మళంగా ఉండనీయవా? అంటూ సెటైర్లు వేస్తున్నారు. కేసీఆర్‌ ఇప్పటికే ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు నాయుడు ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు.. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న నానుడిని ఒంటబట్టించుకుని మీ నాన్న అక్రమాలకు తెర తీస్తున్నారు. అధికారం ఉన్నపుడు దోచుకోవడమే మీకు గుర్తుంది, ఇప్పుడు ప్రజలు గుర్తుకు వచ్చారా అంటూ.. కోడి గుడ్డు మీద ఈకలు పీకే మీ బుద్ధి మారదా? లోకేష్‌ అంటూ నెటిజన్లు స్ట్రాంగ్‌గా కౌంటర్‌ ఇస్తున్నారు.

Read latest Social-media News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా