కోహ్లి బ్యాట్‌తోనే రాణించా: రాయుడు

30 May, 2018 14:49 IST|Sakshi
అంబటి రాయుడు (ఫైల్‌ ఫొటో)

ముంబై : ఐపీఎల్‌-11 సీజన్‌లో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఇచ్చిన బ్యాట్‌తోనే రాణించానని హైదరాబాది ఆటగాడు అంబటి రాయుడు తెలిపాడు. ఐపీఎల్‌ ఆరంభం నుంచి గత సీజన్‌ వరకు ఈ హైదరాబాది ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. తాజా సీజన్‌లో రాయుడిని రూ. 2.20 కోట్లకు చెన్నైసూపర్‌ కింగ్స్‌ దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే చెన్నై తరపున అంబటి రాయుడు చెలరేగాడు. టోర్నీలో16 మ్యాచ్‌లు ఆడిన రాయుడు 602 పరుగులతో బ్యాట్స్‌మన్‌ జాబితాలో నాలుగోస్థానంలో నిలిచాడు. అయితే ఇలా తాను విజృంభించాడానికి  కోహ్లి ఇచ్చిన బ్యాటే కారణమన్నాడు. భజ్జీ బ్లాస్ట్‌ షోలో పాల్గొన్న రాయుడు పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

ప్రతి ఏటా కోహ్లి నుంచి బ్యాట్‌ తీసుకుంటానని, ఇలా అతని నుంచి బ్యాట్‌ తీసుకున్నప్పుడల్లా బాగా రాణించానన్నాడు. ఈ విషయం తెలిసి కొహ్లి బ్యాట్‌ ఇవ్వలేదని, అయినా తీసుకున్నట్లు పేర్కొన్నాడు. ఈ బ్యాట్‌తో చెలరేగిన రాయుడు చెన్నై తరుపున అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఈ సీజన్‌లో అత్యధిక సిక్సుర్లు సాధించిన మూడో బ్యాట్స్‌మన్‌గా రాయుడు(34)  రికార్డు నమోదు చేశాడు. ఇక హర్భజన్‌తో మైదానంలో గొడవపడటంపై సైతం స్పందించాడు.

చదవండి: రాయుడు Vs భజ్జీ : ఎన్నోసార్లు సారీ చెప్పా

మరిన్ని వార్తలు