తెలంగాణలో ఆర్థిక దోపిడీ పెరిగింది: సీతారం ఏచూరి

5 Dec, 2018 11:19 IST|Sakshi
మాట్లాడుతున్న సీతారాం ఏచూరి, చిత్రంలో జూలకంటి రంగారెడ్డి

 సీపీఎం జాతీయ కార్యదర్శి

సాక్షి, మిర్యాలగూడ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆర్థిక దోపిడీ పెరిగిందని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. మంగళవారం మిర్యాలగూలోని ఎన్‌ఎస్‌పీ క్యాంపులో సీపీఎం అభ్యర్థి జూలకంటి రంగారెడ్డి గెలుపు కోసం నిర్వహించిన బహిరంగసభలో ఆయన పా ల్గొని మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత దళి తులు, మైనార్టీలపై దాడులు పెరిగాయని విమర్శించారు. యువత ఉద్యోగాలు లేక ఆర్థ్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటురన్నారని, అన్నదాతల ఆత్మహత్యలు సైతం పెరిగాయన్నారు. దేశంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్‌ ఇద్దరు ఒకటేనన్నారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆరోపించారు. బీజేపీతో టీఆర్‌ఎస్‌ లోపాయకారి ఒప్పందం ఉందన్నారు.

పార్లమెంట్‌లో బీజేపీని టీఆర్‌ఎస్‌ మద్దతు ఇస్తుందని, కానీ ఇక్కడ మా త్రం ముస్లిం ఓట్ల కోసం వ్యతిరేకిస్తుందని అన్నారు. రాష్ట్రంలో కమ్యూనిస్టులకు పూర్వవైభవం వ స్తుందని అన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్‌ పాలనలో ప్రజలు విసిగిపోయారన్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ను ఓడిస్తేనే ప్రజల బతుకులు బాగుపడతాయన్నారు. అంబేద్కరిస్టులు, కమ్యూనిస్టులు కేసీఆర్‌ను పారదోలాలన్నా రు.  రాష్ట్రంలో బీఎల్‌ఎఫ్‌ అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరికి ఉచిత విద్య, వైద్యం అందిస్తామని, చదువుల సావిత్రి పథకాన్ని, కూలీబంధు పథకాన్ని అమలు చేస్తామన్నారు.  

సీపీఎం అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, డబ్బి కార్‌ మల్లేష్‌ అథ్యక్షతన జరిగిన సమావేశంలో  సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారా ములు, జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి, గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రవినాయక్, హుజూర్‌నగర్, నాగార్జునసాగర్‌ బీఎల్‌ఎఫ్‌ అభ్యర్ధులు పారేపల్లి శేఖర్‌రావు, సౌజన్య, నాయకులు రాములు, వీరేపల్లి వెంకటేశ్వర్లు, మాలి పురుషోత్తంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు... 

మరిన్ని వార్తలు