గబ్బర్‌ కబడ్డీ పోజ్‌.. ఎందుకంటే

3 Jun, 2018 15:17 IST|Sakshi
గబ్బర్‌ కబడ్డీ పోజ్‌ (ఫైల్‌ ఫొటో)

ముంబై : టీమిండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ మైదానంలో వినూత్నంగా సంబరాలు చేసుకుంటూ అభిమానులను అలరిస్తుంటాడు. క్యాచ్‌ పట్టిన అనంతరం తొడ కొడుతూ ధావన్‌ ఇచ్చే కబడ్డీ పోజ్‌ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఈ పోజ్‌ వెనుక ఉన్న కథను ఇటీవల గబ్బర్‌ చెప్పుకొచ్చాడు. గౌరవ్‌ కపూర్‌ ‘బ్రేక్‌ ఫాస్ట్‌ విత్‌ చాంపియన్స్‌’ షోలో పాల్గొన్న ధావన్‌ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. 

కబడ్డీ పోజ్‌పై స్పందిస్తూ.. ‘ఆస్ట్రేలియా టెస్ట్‌ సిరీస్‌ నుంచి ఇది ప్రారంభమైంది. షేన్‌ వాట్సన్‌ క్యాచ్‌ పట్టుకున్న అనంతరం తొలి సారి ఈ పోజ్‌ ఇచ్చాను. కబడ్డీ ఆటను నేను ఆస్వాదిస్తాను. కబడ్డీ నాకు ఎంతో వినోదాన్ని ఇస్తుంది. నా హృదయం నుంచి వచ్చిన పోజ్‌ కావడంతో ప్రేక్షకులకు కూడా విపరీతంగా నచ్చింది. బౌండరీ లైన్‌ వద్ద నిలబడితే.. కబడ్డీ స్టైల్‌ పోజ్‌ ఇవ్వాలని అభిమానులు అడుగుతుంటారు.’ అని గబ్బర్‌ చెప్పుకొచ్చాడు. ఇక ఇదే షోలో తనకు గబ్బర్‌ అనే పేరు ఎలా వచ్చిందో కూడా ధావన్‌ తెలియజేశాడు.

చదవండి: ‘గబ్బర్‌’ కథ చెప్పిన ధావన్‌

మరిన్ని వార్తలు