ఏషియాడ్‌ కాంస్య విజేత.. టీ అమ్ముతూ..

7 Sep, 2018 13:33 IST|Sakshi
టీ అమ్ముతున్న భారత అథ్లెట్‌

న్యూఢిల్లీ : హరీష్‌ కుమార్.. ఏషియన్‌ గేమ్స్‌-2018లో కాంస్యం సాధించిన భారత సెపక్‌ తక్రా జట్టులో సభ్యుడు. ప్రస్తుతం అతను టీ అమ్ముతున్నాడు. మెడల్‌ సాధించి టీ అమ్మడం ఏంటని మీడియా ప్రశ్నించగా.. తమది చాలా పేద కుటుంబమని, అందరూ పనిచేస్తేనే ఇళ్లు గడుస్తుందని తన దయనీయ స్థితిని వివరించాడు. ‘మాకున్న చిన్న టీ కొట్టులో మా కుటుంబానికి సాయంగా టీ అమ్ముతాను. ప్రతిరోజు రోజు నాలుగు గంటలు 2 నుంచి 6 మధ్య ప్రాక్టీస్‌ చేస్తాను. భవిష్యత్తులో మంచి ఉద్యోగం సాధించి నా కుటుంబానికి అండగా ఉండాలనుకుంటున్నాను’ అని తన మనసులోని మాటను చెప్పాడు.

ప్రత్యేకంగా ఉండే సెపక్‌ తక్రా ఆట ఆడటం అంత సులవుకాదు. ఈ ఆటను ఆడటానికి తను ఎన్నో కష్టాలని పడ్డానని తెలిపాడు. ‘2011లో ఈ ఆటను ఆడటం ప్రారంభించాను. నా కోచ్‌ హెమ్‌రాజ్‌ నన్ను ఈ ఆటకు పరిచయం చేశారు. ఒకరోజు నేను నా స్నేహితులతో టైర్‌ ఆట ఆడుతుండగా మా కోచ్‌ చూసి నన్ను స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాకు తీసుకెళ్లారు. అప్పటి నుంచి ఉపకార వేతనాలు అందుకుంటూ ఆటను నేర్చుకున్నాను.  దేశానికి మెడల్‌ సాధించాలనే పట్టుదలతో ప్రాక్టీస్‌ చేసేవాడిని.’ అని తెలిపాడు.

హరీష్‌ తల్లి ఇందిరాదేవి మాట్లాడుతూ.. ‘ ఎన్నో కష్టాలు పడుతూ నా పిల్లలను పెంచాను. వీళ్ల నాన్న ఆటో డ్రైవర్‌. మాకు ఓ చిన్న టీకొట్టు ఉంది. నా కొడుకు సైతం టీ అమ్ముతూ మాకు ఆసరాగా ఉంటాడు. నా కొడుకుకు అన్ని సౌకర్యాలు కల్పించి మెడల్‌ సాధించేలా చేసిన ప్రభుత్వానికి ధన్యవాదాలు. అలాగే కోచ్‌ హెమ్‌రాజ్‌ సర్‌కు ఎంతో రుణపడి ఉంటాం.’ అని తెలిపారు.

హరీష్‌ సోదరుడు ధావన్‌ మాట్లాడుతూ.. కాంస్యపతకం సాధించిన తన సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు. ‘కొన్ని సార్లు మా ఇంటి అద్దెను కూడా చెల్లిచలేని ధీన స్థితిమాది. నా సోదరుడిని మొత్తం హేమ్‌రాజ్‌ సరే చూసుకున్నాడు. సాయ్‌ సాయం మరవలేని. అతని ఆటకు కావాల్సిన సామ్రాగ్రి ని అందజేయడంతో పాటు ఉపకార వేతనం అందించింది. రూ. 50 లక్షల రివార్డు ప్రకటించిన సీఎం కేజ్రీవాల్‌కు ధన్యవాదాలు. అలాగే నా సోదరుడికి ప్రభుత్వం ఉద్యోగం కల్పించి మా కుటుంబానికి అండగా నిలివాలి’ అని కోరాడు.  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా