బొటాస్‌కు ‘పోల్‌’

28 Apr, 2019 01:25 IST|Sakshi

నేడు అజర్‌బైజాన్‌ గ్రాండ్‌ప్రి

బాకు (అజర్‌బైజాన్‌): ఈ సీజన్‌లో మంచి ఫామ్‌లో ఉన్న మెర్సిడెస్‌ జట్టు డ్రైవర్‌ వాల్తెరి బొటాస్‌ వరుసగా రెండో రేసులోనూ పోల్‌ పొజిషన్‌ సాధించాడు. శనివారం జరిగిన అజర్‌బైజాన్‌ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్‌ సెషన్‌లో బొటాస్‌ అందరికంటే వేగంగా ఒక నిమిషం 40.495 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేశాడు. ఆదివారం జరిగే ప్రధాన రేసును తొలి స్థానం నుంచి ప్రారంభించే అవకాశాన్ని దక్కించుకున్నాడు.

ఫార్ములావన్‌ సీజన్‌ తొలి రేసు ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలిచిన బొటాస్‌ గత చైనా గ్రాండ్‌ప్రి రేసులోనూ పోల్‌ పొజిషన్‌ సంపాదించాడు. అజర్‌బైజాన్‌ గ్రాండ్‌ప్రిలో మెర్సిడెస్‌ జట్టుకే చెందిన లూయిస్‌ హామిల్టన్‌ రెండో స్థానం నుంచి... ఫెరారీ డ్రైవర్‌ వెటెల్‌ మూడో స్థానం నుంచి రేసును ఆరంభిస్తారు. బహ్రెయిన్, చైనా గ్రాండ్‌ప్రి రేసుల్లో విజేతగా నిలిచిన హామిల్టన్‌ నేటి రేసులోనూ గెలిచి ‘హ్యాట్రిక్‌’ సాధించాలని పట్టుదలతో ఉన్నాడు. 

మరిన్ని వార్తలు