వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌ తొలిసారి..

30 May, 2019 17:37 IST|Sakshi

లండన్‌:  వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. ఇంగ్లండ్‌ ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌(54: 53 బంతుల్లో 8ఫోర్లు) హాఫ్‌ సెంచరీతో మెరవగా, అతనికి తోడుగా జోరూట్‌(51: 59 బంతుల్లో 5 ఫోర్లు) అర్థ శతకం నమోదు చేశాడు. అటు తర్వాత ఇంగ్లండ్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ సైతం హాఫ్‌ సెంచరీ సాధించాడు. 50 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఫలితంగా ఇంగ్లండ్‌ 35 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది.
(ఇక్కడ చదవండి:పన్నెండో ప్రపంచ యుద్ధం)

ఇంగ్లండ్‌ ఒక్క పరుగుకే వికెట్‌ కోల్పోయినప్పటికీ జేసన్‌ రాయ్‌, రూట్‌లు సమయోచితంగా బ్యాటింగ్‌ చేశారు. ఈ క్రమంలోనే వీరు హాఫ్‌ సెంచరీలతో మెరిశారు. 51 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో రాయ్‌ హాఫ్‌ సెంచరీ చేయగా, జో రూట్‌ 56 బంతుల్లో అర్థ శతకం నమోదు చేశాడు. కాగా, ఓపెనర్‌ రాయ్‌ 54 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌ చేరాడు. వీరిద్దరూ 106 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించారు. హాఫ్‌ సెంచరీ తర్వాత భారీ షాట్‌కు యత్నించిన రాయ్‌ ఔటయ్యాడు. సఫారీ బౌలర్‌ ఫెహ్లుకోవాయా బౌలింగ్‌లో డుప్లెసిస్‌కు క్యాచ్‌ ఇచ్చి రాయ్‌ పెవిలియన్‌ బాట పట్టాడు. కాసేపటికి రూట్‌(51) కూడా నిష్క్రమించాడు. రబడా బౌలింగ్‌లో జేపీ డుమినీకి క్యాచ్‌ ఇచ్చిన రూట్‌ పెవిలియన్‌ చేరాడు.  వీరిద్దరూ నాలుగు పరుగుల వ్యవధిలో పెవిలియన్‌ బాట పట్టగా, బట్లర్‌ బాధ్యతాయుతంగా బ్యాటింగ్‌ చేసి జట్టు స్కోరును గాడిలో పెట్టాడు. అతనికి జతగా బెన్‌ స్టోక్స్‌ కూడా హాఫ్‌ సెంచరీ సాధించాడు. 44 బంతుల్లో 6 ఫోర్లతో అర్థ శతకం నమోదు చేశాడు.ఈ జోడి మరో వంద పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేయడం విశేషం. ఒక వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లో నలుగురు ఇంగ్లండ్‌ ఆటగాళ్లు హాఫ్‌ సెంచరీలు చేయడం ఇదే తొలిసారి.

(ఇక్కడ చదవండి: హాఫ్‌ సెంచరీలతో మెరిశారు.. కానీ)
తొలి ఓవర్‌లోనే ఇంగ్లండ్‌కు షాక్‌

మరిన్ని వార్తలు