‘పెయిన్‌ కిల్లర్స్‌తోనే ప్రపంచకప్‌ ఆడాను’

27 Jul, 2019 16:20 IST|Sakshi
జోఫ్రా ఆర్చర్‌

ఇంగ్లండ్‌ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌

లండన్‌ : ఇంగ్లండ్‌ విశ్వవిజేతగా నిలవడంలో ఆ జట్టు పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీని తలపించిన ఫైనల్‌ మ్యాచ్‌లో సూపర్‌ ఓవర్‌లో న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేసి ఇంగ్లండ్‌కు విజయాన్నందించాడు. ఆడిన తొలి ప్రపంచకప్‌లోనే జట్టుకు అందని ద్రాక్షగా మిగిలిన మెగా టైటిల్‌ను అందించాడు. అయితే ఈ టోర్నీ ఆద్యాంతం పక్కటెముకల నొప్పితో విలపించినట్లు ఆర్చర్‌ ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. పెయిన్‌ కిల్లర్‌లు లేనిదే ఆడలేని పరిస్థితి ఏర్పడిందని తన బాధను వెల్లడించాడు. విశ్రాంతి తీసుకునే పరిస్థితి కూడా లేదని, జట్టు తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పుకొచ్చాడు. అఫ్గానిస్తాన్‌ మ్యాచ్‌లో ఈ నొప్పి మరింత తీవ్రమైందని కానీ అప్పటికే జట్టు క్లిష్ట పరిస్థితిలో ఉందన్నాడు.

‘తీవ్ర నొప్పితో విలవిలలాడాను. అదృష్టవశాత్తు ఆ నొప్పి నుంచి త్వరగానే కోలుకున్నాను. కానీ అది వర్ణించలేని బాధ. అఫ్గాన్‌ మ్యాచ్‌ అనంతరం పెయిన్‌ కిల్లర్స్‌ లేనిదే ఆడలేని పరిస్థితి నెలకొంది. కనీసం విశ్రాంతి తీసుకునే పరిస్థితి కూడా లేదు.’  అని ఆర్చర్‌ చెప్పుకొచ్చాడు. ప్రపంచకప్‌ అద్భుత ప్రదర్శనతో యాషెస్‌ టెస్ట్‌ సిరీస్‌ ఎంపికైన ఈ యువ పేసర్‌.. ఈ సిరీస్‌ ద్వారా అంతర్జాతీయ టెస్టుల్లోకి అరంగేట్రం చేయనున్నాడు.


 

మరిన్ని వార్తలు