నటాషా హిందీకి సిగ్గుపడిన హార్ధిక్‌ పాండ్యా!

14 Apr, 2020 12:56 IST|Sakshi

భారత క్రికెటర్‌ హార్ధిక్‌ పాండ్యా లాక్‌డౌన్‌ నేపథ్యంలో తన కాబోయే భార్య నటాషా స్టాన్‌వికోవిచ్‌తో కలిసి ఇంట్లో సరదాగా గడుపుతూ.. సందడి చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలను, ఫొటోలను ఈ జంట తరచూ సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా నటాషాకు హిందీ నేర్పిస్తున్న హార్ధిక్‌ పాండ్యా ఓ సరదా వీడియోను మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. ‘బేబీ.. నేను నీకు ఏమౌతాను’ అని అడగ్గా దానికి నటషా వచ్చిరాని హిందీలో సమాధానం ఇచ్చింది. ఇక నటాషా సమాధానంతో హార్ధిక్‌ సిగ్గుపడుతున్న ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. (‘ఆసక్తికర చర్చ మొదలెట్టి.. ముగించేశాడు’)

@hardikpandya93 blood💥💯#hardikpandya #nature #nature #naturalhairstyles #naturephotography #photo #photographer #photography #photooftheday #photoshoot #photographylovers #photoshop

A post shared by hardikpandya_93 🔵 (@hardikpandya_93_blood) on

కాగా ఈ ఏడాది కొత్త సంవత్సరం వేడుకలో భాగంగా దుబాయ్‌ వెళ్లిన ఈ ఆల్‌రౌండర్‌ అక్కడే సెర్బియా నటి నటాషాను నిశ్చితార్థం చేసుకున్నాడు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో లాక్‌డౌన్‌ అమలవుతున్న విషయం తెలిసిందే. దీంతో సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల వరకూ ఇంటికే పరిమితమయ్యారు. ఇక ఎప్పుడు బిజీ బిజీగా ఉండే సెలబ్రిటీలకు విరామ సమయం దొరికేసరికి ఇంట్లో కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్న ఫొటోలను, వీడియోలను తరచూ అభిమానులతో పంచుకుంటున్నారు. (‘జోమాటో మాదిరిగా ఎందుకు పనికి రానన్నారు’)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు