'కృనాల్‌.. ఒక్కటి ఎక్కువ చెయ్‌ చాలు'

21 Jun, 2020 12:30 IST|Sakshi

ముంబై : టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. లాక్‌డౌన్‌ మొదలైనప్పటి నుంచి మరింత చరుకుగా మారిన పాండ్యా తాను చేస్తున్న ప్రతీ మూమెంట్‌ను షేర్‌ చేసుకుంటున్నాడు. తాజాగా తన అన్న కృనాల్‌ పాండ్యాకు ఫిట్‌నెస్‌ చాలెంజ్‌ విసురుతూ ఒక వీడియో రిలీజ్‌ చేశాడు. ఆ వీడియోలో హర్దిక్‌ డిప్స్‌ కొడుతూనే పుష్‌ అప్‌ మూమెంట్స్‌ చేశాడు. తన బాడీ ఇంకా ఫిట్‌గా తయారవ్వాలని, మరింత స్ట్రాంగ్‌గా ఉండాలని ఇలాంటి కసరత్తులు చేస్తున్నా.. కృనాల్‌ భయ్యా ! నీకు ఇదే నా చాలెంజ్‌..  నాలాగా నువ్వు ఎన్ని పుష్‌అప్‌ మూమెంట్స్‌ చేస్తావో చూడాలని ఉంది. వెంటనే చాలెంజ్‌ను అంగీకరిస్తావనే అనుకుంటున్నా' అంటూ క్యాప్షన్‌ జత చేశాడు.(వీరు.. ఆసనం పేరేంటో చెప్పవా?)

దీనిపై కృనాల్‌ స్పందించలేదు కానీ బాలీవుడ్‌కు చెందిన నటీమణులు సయామీ ఖైర్‌, కరీష్మా తన్నాలు 'వావ్‌ హార్దిక్‌ పాండ్యా.. నిజంగా అద్భుతం.. ఎలా చేసావ్‌ ఇది' అంటూ కామెంట్లు జత చేశారు. కాగా లాక్‌డౌన్‌ మొదలైనప్పటి నుంచి కృనాల్‌తో తాను దిగిన చిన్ననాటి ఫోటోలను షేర్‌ చేసిన పాండ్యా తాజాగా గత నెలలో  భార్య నటాషాతో దిగిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్‌ చేసిన సంగతి తెలిసిందే. ఆ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. 2019 సెప్టెంబర్‌లో వెన్నునొప్పికి గురైన పాండ్యా అప్పటినుంచి క్రికెట్‌లో బరిలోకి దిగలేదు.  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా