హంటర్స్‌ ఖాతాలో తొలి గెలుపు

27 Jan, 2020 02:46 IST|Sakshi

అవద్‌ వారియర్స్‌పై 2–1తో విజయం

పీబీఎల్‌

లక్నో: ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (పీబీఎల్‌) ఐదో సీజన్‌లో హైదరాబాద్‌ హంటర్స్‌కు తొలి విజయం లభించింది. ఆదివారం ఇక్కడ జరిగిన పోరులో హైదరాబాద్‌ హంటర్స్‌ 2–1తో అవధ్‌ వారియర్స్‌పై గెలుపొందింది. పురుషుల తొలి సింగిల్స్‌లో సౌరభ్‌ వర్మ (హైదరాబాద్‌) 14–15, 15–12, 15–10తో శుభాంకర్‌ డే (అవ«ద్‌)పై గెలుపొందాడు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ఇవనోవ్‌–సిక్కి రెడ్డి (హైదరాబాద్‌) ద్వయం 15–12, 15–14తో షిన్‌ బేక్‌–క్రిస్టీనా (అవధ్‌) జోడీపై నెగ్గింది. ఈ మ్యాచ్‌లో ‘ట్రంప్‌ కార్డు’తో ఆడిన అవధ్‌ వారియర్స్‌ ఓడిపోవడంతో... పీబీఎల్‌ నిబంధనల ప్రకారం వారి స్కోరుకు ఒక పాయింట్‌ పెనాల్టీ విధించారు. దాంతో హైదరాబాద్‌ 2–(–1)తో ఆధిక్యంలో నిలిచింది.

తర్వాత జరిగిన మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు (హైదరాబాద్‌) 15–8, 15–8తో తన్వీ లాడ్‌ (అవధ్‌)పై విజయం సాధించడంతో హైదరాబాద్‌ 3–(–1)తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. దాంతో మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే హైదరాబాద్‌ విజయాన్ని ఖాయం చేసుకుంది. పురుషుల రెండో సింగిల్స్‌లో ‘ట్రంప్‌ కార్డుతో బరిలో దిగిన హైదరాబాద్‌ ప్లేయర్‌ డారెన్‌ లీయూ 14–15, 9–15తో విన్సెంట్‌ (అవధ్‌ వారియర్స్‌) చేతిలో ఓడిపోవడంతో... ఈసారి హైదరాబాద్‌కు పెనాల్టీ ఎదురైంది. దాంతో హైదరాబాద్‌ ఆధిక్యం 2–0కు తగ్గింది. చివరి మ్యాచ్‌ అయిన పురుషుల డబుల్స్‌లో ఇవనోవ్‌–బెన్‌ లేన్‌ (హైదరాబాద్‌) జోడీ 12–15, 8–15తో కో సుంగ్‌ హ్యూన్‌–íÙన్‌ బేక్‌ (అవధ్‌ వారియర్స్‌) చేతిలో ఓడింది. నేటి మ్యాచ్‌లో పుణే 7 ఏసెస్‌తో బెంగళూరు రాప్టర్స్‌ తలపడుతుంది.  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా