చివర్లో చేతులెత్తేశారు

27 Jan, 2020 02:55 IST|Sakshi

మూడో అనధికారిక వన్డేలో భారత ‘ఎ’ జట్టు ఓటమి

క్రైస్ట్‌చర్చ్‌: విజయం కోసం 11 బంతుల్లో 14 పరుగులు చేయాల్సిన సమయంలో భారత బ్యాట్స్‌ మెన్‌ చేతులెత్తేశారు. 9 బంతుల్లో చివరి 4 వికెట్లను కోల్పోయి మ్యాచ్‌ను ప్రత్యర్థికి అప్పగించేశారు. న్యూజిలాండ్‌ ‘ఎ’తో ఆదివారం ఇక్కడ జరిగిన అనధికారిక మూడో వన్డేలో భారత్‌ ‘ఎ’ 5 పరుగుల తేడాతో ఓడింది. ఛేదనలో ఇషాన్‌ కిషన్‌ (84 బంతుల్లో 71 నాటౌట్‌; 8 ఫోర్లు) పోరాటం వృథా అయింది. ఫలితంగా కివీస్‌ 2–1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ 50 ఓవర్లలో 7 వికెట్లకు 270 పరుగులు చేసింది. 

మార్క్‌ చాప్‌మ్యాన్‌ (110 నాటౌట్‌; 10 ఫోర్లు, సిక్స్‌), టాడ్‌ ఆస్టల్‌ (56; 2 ఫోర్లు, సిక్స్‌) రాణించారు. ఇషాన్‌ పోరెల్‌ మూడు వికెట్లు తీయగా... రాహుల్‌ చహర్‌ రెండు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అనంతరం ఛేదనలో భారత్‌ 49.4 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు పృథ్వీ షా (55; 8 ఫోర్లు, సిక్స్‌), రుతురాజ్‌ గైక్వాడ్‌ (44; 6 ఫోర్లు) రాణించారు. జామీసన్‌ 4, ఎజాజ్‌ పటేల్‌ 3 వికెట్లతో కివీస్‌ విజయంలో కీలక పాత్ర పోషించారు.  

>
మరిన్ని వార్తలు