పాక్‌తో భారత్‌ తొలి పోరు

29 Nov, 2017 00:16 IST|Sakshi

గోల్డ్‌కోస్ట్‌ (ఆస్ట్రేలియా): వచ్చే ఏడాది జరిగే కామన్వెల్త్‌ గేమ్స్‌ హాకీ పోటీల్లో భారత జట్టు తమ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో తలపడనుంది. చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్తాన్‌ ఒకే పూల్‌లో ఉండటం విశేషం. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను అంతర్జాతీయ హాకీ సమాఖ్య మంగళవారం విడుదల చేసింది. పూల్‌ ‘బి’లో భారత్, పాక్‌లతో పాటు ఇంగ్లండ్, మలేసియా, వేల్స్‌ జట్లున్నాయి. ఐదుసార్లు చాంపియన్‌ అయిన ఆస్ట్రేలియా... న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, కెనడా, స్కాట్లాండ్‌లు పూల్‌ ‘ఎ’లో ఉన్నాయి. ఏప్రిల్‌ 7న భారత్‌ తమ తొలి మ్యాచ్‌లో పాక్‌తో తలపడుతుంది. తర్వాత 8న వేల్స్, 10న మలేసియా, 11న ఇంగ్లండ్‌లతో పోటీపడుతుంది.  

పూల్‌ ‘ఎ’లో భారత మహిళల జట్టు: భారత మహిళల జట్టు పూల్‌ ‘ఎ’లో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, మలేసియా, వేల్స్‌తో తలపడనుంది. పూల్‌ ‘బి’లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, స్కాట్లాండ్, కెనడా, ఘనా జట్లున్నాయి. ఏప్రిల్‌ 5న జరిగే తొలి మ్యాచ్‌లో వేల్స్‌ను ఎదుర్కోనున్న భారత్‌...  6న మలేసియా, 8న ఇంగ్లండ్, 10న దక్షిణాఫ్రికాలతో ఆడుతుంది. కామన్వెల్త్‌ గేమ్స్‌ వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5 నుంచి 14 వరకు జరగనున్నాయి.  

మరిన్ని వార్తలు