ముంబైతో మ్యాచ్‌: బెన్‌ స్టోక్స్‌ ఔట్‌

13 Apr, 2019 15:53 IST|Sakshi

ముంబై: ఐపీఎల్‌లో భాగంగా ఇక్కడ వాంఖేడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన రాజస్తాన్‌ కెప్టెన్‌ అజింక్యా రహానే ముందుగా ముంబైను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఇప్పటివరకూ ముంబై ఇండియన్స్‌ ఆరు మ్యాచ్‌లు ఆడి నాలుగు మ్యాచ్‌ల్లో గెలుపొందగా, రాజస్తాన్‌ ఆరు మ్యాచ్‌లకు గాను ఒకదాంట్లో మాత్రమే విజయం సాధించింది. దాంతో విజయం కోసం ఆరాటుపడుతోంది రాజస్తాన్‌. ప్రధానంగా గెలుపు అంచుల వరకూ వచ్చి ఓటమి పాలు కావడం రాజస్తాన్‌ను కలవర పెడుతోంది.

కాగా, ముంబై ఇండియన్స్‌కు సొంత గ్రౌండ్‌లో జరిగే మ్యాచ్‌ కావడంతో ఆ జట్టు ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. గత మ్యాచ్‌లో గాయం కారణంగా దూరమైన ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఫిట్‌ అయ్యాడు. దాంతో రాజస్తాన్‌తో మ్యాచ్‌కు రోహిత్‌ సిద్ధమయ్యాడు. మరొకవైపు గాయం కారణంగా రాజస్తాన్‌ ఆటగాడు బెన్‌ స్టోక్స్‌  జట్టుకు దూరమయ్యాడు. అతని స్థానంలో లివింగ్‌ స్టోన్‌ తుది జట్టులోకి వచ్చాడు.

ముంబై ఇండియన్స్‌
రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), డీకాక్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌, పొలార్డ్‌, హార్దిక్‌ పాండ్యా, కృనాల్‌ పాండ్యా, అల్జరీ జోసెఫ్‌, రాహుల్‌ చాహర్‌, బెహ్రాన్‌డార్ఫ్‌, బుమ్రా

రాజస్తాన్‌ రాయల్స్‌
అజింక్యా రహానే(కెప్టెన్‌), జోస్‌ బట్లర్‌, సంజూ శాంసన్‌, స్టీవ్‌ స్మిత్‌, రాహుల్‌ త్రిపాఠి, లివింగ్‌ స్టోన్‌, కృష్ణప్ప గౌతమ్‌, జోఫ్రా ఆర్చర్‌, శ్రేయస్‌ గోపాల్‌, ఉనాద్కత్‌, ధావల్‌ కులకర్ణి

Liveblog

మరిన్ని వార్తలు